సోమ్‌నాథ్ చటర్జీ జీవితంలో వివాదాలు: సుప్రీం తీర్పుపై అసంతృప్తి

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 13, Aug 2018, 11:40 AM IST
Somnath Chatterjee controversies in his political life
Highlights

సుదీర్ఘకాలం పాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగిన మాజీ లోక్‌సభ స్పీకర్, సీపీఎం నుండి బహిష్కరణకు గురైన సోమ్‌నాథ్ చటర్జీ  తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాడు. కోర్టులు  చట్టసభల్లో జోక్యం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు.  


న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం పాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగిన మాజీ లోక్‌సభ స్పీకర్, సీపీఎం నుండి బహిష్కరణకు గురైన సోమ్‌నాథ్ చటర్జీ  తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాడు. కోర్టులు  చట్టసభల్లో జోక్యం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు.  అంతేకాదు స్పీకర్‌గా ఎన్నికైనప  నాటి నుండే తాను పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయాయని పార్టీ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సీపీఎంకు తేల్చిచెప్పాడు. దీంతో ఆయన పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యాడు.

1971 నుండి ఆయన ఎంపీ గా విజయం సాధిస్తూ వచ్చారు. 2009 తర్వాత సోమ్‌నాథ్ చటర్జీ  క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకొన్నారు. 1984లో సోమ్‌నాథ్ చటర్జీ మమత బెనర్జీ చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే 2004 నుండి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా సోమ్‌నాథ్ చటర్జీ పనిచేశారు. ఆ సమయంలో  స్పీకర్ గా సోమ్‌నాథ్ చటర్జీ తీసుకొన్న పలు నిర్ణయాలు సంచలనంగా మారాయి. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టులు చట్టసభల్లో జోక్యం చేసుకోవడాన్ని సోమ్‌నాథ్ తీవ్రంగా తప్పుబట్టారు.

2005లో  జార్ఖండ్  రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాసం విషయంలో  సుప్రీంకోర్టు జారీ చేసిన  ఆదేశాలను ఆయన తప్పుబట్టారు. చట్ట సభల  హక్కులను  సుప్రీంకోర్టు ఆక్రమించుకొందని ఆయన వ్యాఖ్యలు చేశారు.. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే  సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆనాడు బీజేపీ  సమ ర్థించింది. 

మరోవైపు అణు ఒప్పందానికి వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వంపై  సీపీఎం అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.అణు ఒప్పందానికి వ్యతిరేకంగా పార్టీ ప్రతిపాదించిన  అవిశ్వాసానికి  అనుకూలంగా ఓటు చేయాలని  సీపీఎం సోమ్‌నాథ్ చటర్జీని ఆదేశించింది.అయితే సోమ్‌నాథ్ చటర్జీ మాత్రం  సీపీఎం ఆదేశాలను పట్టించుకోలేదు.

స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత తనకు పార్టీతో సంబంధాలు తెగిపోయాయని  ఆయన ప్రకటించారు. 2008 జూలైలో యూపీఏ ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస పరీక్షలో  సోమ్ నాథ్ చటర్జీ వ్యవహరశైలిపై సీపీఎం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన సోమ్ నాథ్ చటర్జీని  పార్టీ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. సోమ్ నాథ్ పార్టీ  నియమావళికి విరుద్దంగా వ్యవహరించారని ఆనాడు పార్టీ అభిప్రాయపడింది.

ఈ వార్తలు చదవండి

కారత్‌కు చుక్కలు చూపించాడు, ఎవరీ సోమ్‌నాథ్ చటర్జీ?

సోమనాథ్ ఛటర్జీ: నిబద్ధతకు శిక్ష, బహిష్కరణకు గురై ఒంటరి జీవితం

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ కన్నుమూత

 

loader