అనారోగ్య కారణాలతో మాజీ లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ సోమవారం నాడు మృతి చెందాడు.సుదీర్ఘకాలంగా సీపీఎంలో పనిచేశాడు. సీతారాం ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో మరోసారి ఆయన సీపీఎంకు దగ్గరయ్యారు.
న్యూఢిల్లీ: అనారోగ్య కారణాలతో మాజీ లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ సోమవారం నాడు మృతి చెందాడు.సుదీర్ఘకాలంగా సీపీఎంలో పనిచేశాడు. సీతారాం ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో మరోసారి ఆయన సీపీఎంకు దగ్గరయ్యారు.
లోక్‌సభ స్పీకర్ గా ఉన్న కాలంలో పార్టీ సూచనల మేరకు వ్యవహరించలేదని సోమ్‌నాథ్ చటర్జీని సీపీఎం బహిష్కరించింది.దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్పీకర్ గా ఉన్నందున తాను పార్టీ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సోమ్‌నాథ్ చటర్జీ వాదించారు.
స్పీకర్ పదవీ కాలం ముగిసిన తర్వాత సోమ్‌నాథ్ చటర్జీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే గత ఏడాదిలో సీపీఎం జాతీయ ప్రధాన కారద్యర్శి సీతారాం ఏచూరి కోల్‌కత్తాలో సోమ్‌నాథ్ చటర్జీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పటి నుండి ఆయన సీపీఎంతో సన్ని:హిత సంబంధాలను కలిగి ఉన్నారు.
2004 నుండి 2009 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది.ఈ కాలంలో యూపీఏ కు సీపీఎం బయట నుండి మద్దతు పలికింది.దీంతో సీపీఎం నేత, ఎంపీ సోమ్‌నాథ్ చటర్జీని స్పీకర్‌గా ఎన్నుకొన్నారు.
న్యాయవాదిగా ఉన్న సోమ్‌నాథ్ చటర్జీ 1968లో రాజకీయాల్లో చేరారు. 1971లో సోమ్‌నాథ్ చటర్జీ తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా విజయం సాధించారు. ఆ సమయంలో సోమ్‌నాథ్ చటర్జీ కి సీపీఎం మద్దతు ప్రకటించింది.
పది దఫాలు సోమ్‌నాథ్ చటర్జీ ఎంపీగా విజయం సాధించారు. సుధీర్ఘకాలం పాటు ఆయన ఎంపీగా సేవలు చేశారు. 1971 నుండి 2009 వరకు ఆయన పలు పార్లమెంట్ సెగ్మెంట్ల నుండి ఆయన ఎంపీగా విజయం సాధించారు.
అయితే 1984లో మమత బెనర్జీ చేతిలో సోమ్‌నాథ్ చటర్జీ ఓటమి పాలయ్యారు.ఈ ఒక్క ఎన్నికల్లో మినహా ప్రతి ఎన్నికల్లో ఆయన సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
1996లో ఉత్తమ్ పార్లమెంటేరియన్‌గా సోమ్‌నాథ్ చటర్జీ ఎన్నికయ్యారు. 2004లో ఆయన ప్రోటెం స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా సోమ్‌నాథ్ చటర్జీని ఎంపీలు ఎన్నుకోవడం గమనార్హం. రెండో సారి ఆయన ప్రోటెం స్పీకర్ గా ఎన్నికయ్యారు. గణేష్ వాసుదేవ్ మావలంకర్ తర్వాత రెండోసారి ప్రోటెం స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి సోమ్‌నాథ్ చటర్జీ.
2008లో సీపీఎం నుండి సోమ్‌నాథ్ చటర్జీ బహిష్కరణకు గురయ్యారు. యూపీఏకు సీపీఎం తన మద్దతును ఉపసంహరించుకొన్న తర్వాత సోమ్‌నాథ్ చటర్జీ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని సీపీఎం చేసిన సూచనను సోమ్‌నాథ్ చటర్జీ వ్యతిరేకించారు. యూపీఏ సర్కార్‌పై సీపీఎం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి ఆయన వ్యతిరేకంగా ఓటు చేయలేదు. 2009 తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల నుండి దూరమయ్యారు.
అణు ఒప్పందానికి వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వ తీరును ఆనాడు సీపీఎం వ్యతిరేకించింది. దీంతో అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ఉండాలని యూపీఏను కోరింది. కానీ సీపీఎం ప్రతిపాదనల పట్ల యూపీఏ తలొగ్గలేదు.దీంతో యూపీఏపై సీపీఎం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ సమయంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కారత్ ఉన్నాడు. పార్టీ ఆదేశాల మేరకు స్పీకర్ గా అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీకి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అయితే పార్టీ ఆదేశాలను సోమ్‌నాథ్ ధిక్కరించాడు. దీంతో 2008లో ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు.
