రాత్రింబవళ్లు అదే పని.. ఈ పెళ్లాం నాకొద్దు బాబోయ్

First Published 29, Jun 2018, 12:40 PM IST
software engineer applyinng divorce for wife social media addiction
Highlights

రాత్రింబవళ్లు అదే పని.. ఈ పెళ్లాం నాకొద్దు బాబోయ్

ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న దానికి ఏదో ఒక గొడవ జరగడం అది విడాకుల దాకా వెళ్లడం బాగా ఎక్కువైంది. అయితే ఢిల్లీలో ఓ వ్యక్తి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తూ.. అందుకు వెరైటీ కారణం తెలిపాడు.. నరేంద్రసింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గతేడాది వివాహాం జరిగింది.. అతనికి ఆ ఆనందం ఆవిరవ్వడం 24 గంటలు పట్టలేదు.. పెళ్లయిన రోజు నుంచి ఆమె ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతూ.. సోషల్ మీడియాలోనే కాలం గడుపుతోంది..

మొదట్లో దీనిని పెద్దగా పట్టించుకొని అతనికి.. ఆమె వైఖరితో కోపం నషాళానికి అంటింది.. ఇంటిపనులు పట్టించుకోకపోగా.. అర్థరాత్రి దాకా అబ్బాయిలతో ఛాటింగ్ చేస్తుండటంతో పద్దతి మార్చుకోవాలని గట్టిగా మందలించాడు. అయినప్పటికి భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. ప్రతి రోజు గొడవకు పడేవారు.. దీంతో చేసేదేంలేక ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విడాకులే శరణ్యమని భావించి కోర్టును ఆశ్రయించాడు.

అతని పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం కౌన్సెలింగ్ ద్వారా దంపతులను కలిపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వివాహానంతరం అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మారేందుకు తన అత్తింటి వారు అవకాశం ఇవ్వలేదని భార్య తరపున న్యాయవాది అంటున్నారు. అటు ఈ విషయం న్యాయశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వల్ల విడాకులు కోరడం సమాజంలో ఆందోళన కలిగించే విషయమని పలువురు న్యాయనిపుణులు అంటున్నారు.
 

loader