Patna: రాజ‌కీయ నాయ‌కుడు, హ‌త్య‌కు గురైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కు మద్దతుగా పాట్నాలో ప‌లువురు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. ఆందోళనకారులు కేంద్రానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Slogan raised in support of Atiq ahmed: హత్యకు గురైన రాజ‌కీయ నాయ‌కుడు, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్, కుమారుడు అసద్ అహ్మద్ లకు మద్దతుగా ప‌లువురు నినాదాలు చేశారు. రంజాన్ మాసం చివరి రోజున పాట్నా జంక్షన్ సమీపంలోని జామా మసీదు వద్ద "అల్విదా కా నమాజ్" చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రార్థనల అనంతరం కొందరు రోడ్లపైకి వచ్చి షహీద్ అతిక్ అహ్మద్ అమర్ రహే, అష్రఫ్ అహ్మద్ అమర్ రహే, అసద్ అహ్మద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అతిక్ అహ్మద్, అతని సోదరుడు, కుమారుడి హత్యకు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే కారణమని నిరసనకారుల్లో ఒకరైన రయీస్ ఘజ్నవి ఆరోపించార‌ని ఐఏఎన్ఎస్ నివేదించింది. నేరస్థులను ఉపయోగించి ప్రణాళికాబద్ధంగా హత్య చేశారు. ఈ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం, యూపీ పోలీసులు, మీడియా, కోర్టు ప్రమేయం ఉందని ఆరోపించారు. 

అతిక్ అహ్మద్ క్రిమినల్ కాదా అని ప్రశ్నించగా.. "దేశంలో చట్టాలు, కోర్టులు ఉన్నాయి. కోర్టు వారికి మరణశిక్ష విధిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ అన్నదమ్ములను చంపడానికి నేరస్థులను ఉపయోగించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. కోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసుల రిమాండ్ కు విధించిందని, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇద్దరినీ పథకం ప్రకారం హత్య చేశారని" పేర్కొన్నారు.