నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లు మాత్రమే ఆహారం.. ప్రధాని మోడీ పాటిస్తున్న కఠోర నియమాలివే..

అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ (ayodhya ram mandir pran pratishtha) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) కఠోర నియమాలు పాటిస్తున్నారు. 11 రోజుల పాటు ‘అనుస్థాన్’ (anusthan) ఆచరిస్తున్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా ప్రధాని నేలపైనే పడుకుంటున్నారు. కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు.

Sleep on the floor..Coconut water is the only food..These are the strict rules followed by Prime Minister Modi..ISR

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ 'అనుస్థాన్' (ప్రత్యేక ఆచారం) పాఠిస్తున్నారు. అందులో భాగంగా ఆయన కఠిన నియమాలను పాటిస్తున్నారు. నేలపైనే  నిద్రపోతున్నారు. కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది.

అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి, జై శ్రీరామ్ రకాలుంటాయా ? - బండి సంజయ్

జనవరి 12వ తేదీన ఈ అనుస్థాన్ పాఠిస్తున్నట్టు ప్రధాన నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన చారిత్రాత్మక, శుభకార్యాన్ని వీక్షించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు తనను ఒక సాధనంగా ఎంచుకున్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో 11 రోజుల ప్రత్యేక మతపరమైన వ్యాయామాన్ని చేపడుతున్నానని ప్రధాన మంత్రి చెప్పారు.

11 రోజుల పాటు 'యమ్ నియామ్'కు కట్టుబడి ఉంటారని, గ్రంథాలలో పేర్కొన్న అన్ని సూచనలను ఖచ్చితంగా పాటించాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నియమంలో భాగంగా యోగా, ధ్యానం, వివిధ అంశాల్లో క్రమశిక్షణతో సహా అనేక కఠినమైన చర్యలను పాఠించాల్సి ఉంటుంది. సూర్యోదయానికి ముందు శుభ సమయంలో మేల్కొనడం, ధ్యానం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం వంటి అనేక క్రమశిక్షణలను ప్రధాని మోడీ తన దైనందిన జీవితంలో ఇప్పటికే అనుసరిస్తున్నారని అధికారులు తెలిపారు.

లిక్కర్ పాలసీ స్కామ్ లో కేసులో నిందితుడిని కాదు.. మరెందుకు సమన్లు పంపారు - ఈడీతో కేజ్రీవాల్

ఇదిలా ఉండగా.. జనవరి 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ముందు బుధవారం రాత్రి అయోధ్యలోని రామమందిర గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని తీసుకువచ్చినట్లు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన గురువారంలోగా పూర్తవుతుందని భావిస్తున్నారు.

బీజేపీ ఆదేశాల మేరకే తెలంగాణ కాంగ్రెస్ పని చేస్తోంది - కేటీఆర్

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సాధువులు సహా 7,000 మందికి పైగా ఈ వేడుకకు హాజరవుతారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios