Asianet News TeluguAsianet News Telugu

లిక్కర్ పాలసీ స్కామ్ లో కేసులో నిందితుడిని కాదు.. మరెందుకు సమన్లు పంపారు - ఈడీతో కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (delhi cm arvind kejriwal)ను లోక్ సభ ఎన్నికల (lok sabha elections 2024)ప్రచారం నుంచి తప్పించేందుకే బీజేపీ (bjp) ఈడీ (ED)ని దుర్వినియోగం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party)ఆరోపించింది. కేజ్రీవాల్ మద్యం పాలసీ స్కామ్ కేసు (liquor scam case-delhi)లో నిందితుడిగా లేరని, మరి అలాంటప్పుడు ఈడీ సమన్లు (ED summonses) ఎందుకు పంపించిందని ప్రశ్నించింది. 

He is not the accused in the Liquor Policy Scam case.. Why else summons were sent - Kejriwal with ED..ISR
Author
First Published Jan 18, 2024, 2:06 PM IST

arvind kejriwal : ఎక్సైజ్ పాలసీ సంబంధిత మనీలాండరింగ్ కేసులో తాను నిందితుడిగా లేకపోతే తనకు సమన్లు ఎందుకు జారీ చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి సమాధానం ఇచ్చారు. నాలుగో సారి ఈడీ ఇచ్చిన సమన్లపై మీడియా ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తానని చెప్పారు.

మేం బయట చేయాల్సిన పనులున్నాయ్.. కాస్త సమయం ఇవ్వండి.. - సుప్రీంకోర్టును కోరిన బిల్కిస్ బానో కేసు దోషులు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేతను ఆదేశించిందిచ అయితే ఈ సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ సమాధానమిస్తూ.. తాను విచారణకు హాజరు కాబోనని స్పష్టం చేశారు. కాగా.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలనేది బీజేపీ యోచనగా కనిపిస్తోందని ఆప్ ఆరోపించింది.

కేజ్రీవాల్ నిందితుడని ఈడీ చెప్పిందని, అలాంటప్పుడు ఆయనకు ఎందుకు సమన్లు జారీ చేస్తున్నారని ప్రశ్నించింది. అవినీతి నేతలు బీజేపీలోకి వెళ్తారని, వారి కేసులు మూసుకుపోతాయన్నాని ఆరోపించారు. తాము ఎలాంటి అవినీతి చేయలేదని, తమ నేతలెవరూ బీజేపీలోకి వెళ్లరని స్పష్టం చేసింది.

ఈ చైనా ఊరికే ఉండదుగా.. మరో ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు.. 100 శాతం మరణాల రేటట..

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజుల గోవా పర్యటనకు వెళ్లనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటనను వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి, అక్కడ పార్టీ కార్యకర్తలతో మమేకమై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

కాగా.. దర్యాప్తు సంస్థ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, తనను అరెస్టు చేయాలనే ఏకైక ఉద్దేశమే దీని వెనక ఉందని పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి జనవరి 3న విచారణకు గైర్హాజరయ్యారు. ‘‘న్యాయపరమైన ప్రతీ సమన్లను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే,ఈ ఈడీ సమన్లు కూడా గతంలో మాదిరిగానే చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి.. సమన్లను ఉపసంహరించుకోవాలి. నిజాయతీ, పారదర్శకతతో నా జీవితాన్ని గడిపాను. దాచడానికి ఏమీ లేదు’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు

రైతుగా మారిన కలెక్టర్.. పొలంలో దిగి వరి నాట్లు వేసిన ముజమ్మిల్ ఖాన్..

గతంలో నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో రెండుసార్లు విచారణకు హాజరయ్యేందుకు నిరాకరించిన ఆయన 10 రోజుల విపాసన ధ్యాన శిబిరానికి హాజరయ్యారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా గత ఏడాది అక్టోబర్ లో అరవింద్ కేజ్రీవాల్ కు ప్రాథమిక సమన్లు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios