Asianet News TeluguAsianet News Telugu

అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి, జై శ్రీరామ్ రకాలుంటాయా ? - బండి సంజయ్

Bandi sanjay :  కొందరు అక్షింతల ప్రాముఖ్యత, ప్రాధాన్యత, పవిత్రత తెలియకుండా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి బియ్యం, జై శ్రీరాం అనే రకాలు ఉండవని తెలిపారు. 

Bandi Sanjay countered Ponnam Prabhakar's comments..ISR
Author
First Published Jan 18, 2024, 3:06 PM IST

Bandi sanjay : దేవుడు అక్షింతలను రాజకీయం చేయడం తగదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. గురువారం ఉదయం ఆయన కరీంనగర్ పద్మానగర్ లోని శివాలయంను సందర్శించారు. ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈనెల 22న రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని తెలిపారు. ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ది చేస్తున్నామని తెలిపారు.

లిక్కర్ పాలసీ స్కామ్ లో కేసులో నిందితుడిని కాదు.. మరెందుకు సమన్లు పంపారు - ఈడీతో కేజ్రీవాల్

అనంతరం అక్షింతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి  అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. దేవుడి అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి, జై శ్రీరామ్ అనే రకాలు ఉంటాయా అని ప్రశ్నించారు. దేవుడి అక్షింతలను రాజకీయం చేయడం తగదని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ హిందువు సహకారం వల్ల నేడు రామ మందిర కల సాకారమైందని అన్నారు. అయోధ్యలో రామ మందిర కార్యక్రమం జనవరి 22వ తేదీన ప్రారంభమవుతోందని చెప్పారు. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్షింతలు పంపిణీ విజయవంతంగా సాగుతోందని తెలిపారు. అన్ని పార్టీల నాయకులు ఈ అక్షింత పంపినీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు.

అక్షింతల పవిత్రత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలియకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదని బండి సంజయ్ అన్నారు. విమర్శలు ప్రతి విమర్శలకు ఇది సమయం కాదని తెలిపారు. ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, ఇందులో అందరూ పాల్గొనాలని సూచించారు. దీనిని ఒక పండగలా జరుపుకోవాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios