Asianet News TeluguAsianet News Telugu

ముంబాయి ఎయిర్ పోర్టులో కరోనా కలకలం.. ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు పాజిటివ్..

పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తుల్లో కొందరికి లక్షణాలు కనిపించలేదని, మరికొందరిలో స్వల్పస్థాయి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం  వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు పేర్కొంది.  ఆ జాబితాలో  యూకే తో పాటు  ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా,  botswana,  బ్రెజిల్, బంగ్లాదేశ్, హాంకాంగ్, ఇజ్రాయిల్, న్యూజిలాండ్ ఉన్నాయి.

Six passengers returning from 'high-risk' countries test positive in Maharashtra
Author
Hyderabad, First Published Dec 1, 2021, 1:24 PM IST

ముంబాయి :  ప్రమాదం పొంచి ఉన్న దేశాల నుంచి మహారాష్ట్రకు చేరుకున్న ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణీకులకు కరోనా పాజిటివ్ గా తేలింది.  ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఆ జాబితాలో  కొత్త వేరియంట్  ఒమిక్రాన్ ను గుర్తించిన దేశాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కాగా పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తుల్లో కొందరికి లక్షణాలు కనిపించలేదని, మరికొందరిలో స్వల్పస్థాయి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం  వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు పేర్కొంది.  ఆ జాబితాలో  యూకే తో పాటు  ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా,  botswana,  బ్రెజిల్, బంగ్లాదేశ్, హాంకాంగ్, ఇజ్రాయిల్, న్యూజిలాండ్ ఉన్నాయి.

మహారాష్ట్రలో ఏడురోజుల సంస్థాగత క్వారంటైన్..
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. దేశంలోని పలు విమానాశ్రయాల్లో  ఈరోజు నుంచి  కట్టడి చర్యలు  కఠినతరం అయ్యాయి.  ప్రమాదం పొంచి ఉన్న జాబితాలోని దేశాల నుంచి వచ్చే పౌరులకు పరీక్షలు చేయడం తో పాటు కఠిన  క్వారంటైన్ నియమాలు అమలు అవుతున్నాయి. 

ఆ ప్రయాణికులు పరీక్షల అనంతరం ఫలితం తేలకుండా విమానాశ్రయం నుంచి బయటకు వెళ్ళడానికి వీలు లేదు. నెగెటివ్ అని తేలితే ఏడు రోజుల హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది.  మహారాష్ట్రకు చేరుకునే ప్రయాణికులంతా తప్పనిసరిగా ఏడురోజుల సంస్థాగత క్వారంటైన్ లో ఉండాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

COVID-19 cases in India: ఆ తర్వాత నవంబర్‌లోనే తక్కువ కరోనా కేసులు.. ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయంటే..

ఇదిలా ఉండగా, దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త కేసులు అదుపులోనే ఉండటంతో పాటు క్రియాశీలక కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా అవి లక్ష దిగువకు చేరడంతో ప్రభుత్వ వర్గాలు ఊపీరి పిల్చుకుంటున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

దీనికి సంతోషిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం నేపథ్యంలో కేంద్రం ఆందోళన చెందుతోంది. ఈ సమయంలో ప్రజలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,954 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (corona cases in india) ప్రకటించింది. 

కొత్త కేసులు 10వేలకు దిగువనే ఉన్నప్పటికీ.. ముందురోజు కంటే పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 10,207 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు సంఖ్య 99,023(0.29 శాతం)కి చేరింది.  దేశవ్యాప్తంగా 3.45 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 3.40 కోట్ల మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. గతేడాది మార్చి నుంచి ఇదే అత్యధికం. 24 గంటల వ్యవధిలో 267 మంది ప్రాణాలు (corona deaths in india) కోల్పోయారు. 

అత్యధికంగా కేరళలో మరణాల సంఖ్య 177గా ఉంది. మొత్తంగా 4,69,247 మంది దేశంలో కోవిడ్ వల్ల కన్నుమూశారు. నిన్న 80,98,716 మంది టీకా వేయించుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 124 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios