Asianet News TeluguAsianet News Telugu

శ్రద్ధా వాకర్ హత్య కేసు.. ప్రియురాలిని చంపిన గంట తరువాత ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేసిన అఫ్తాబ్..

శ్రద్ధావాకర్ ను హత్య చేసిన తరువాత నిందితుడు అఫ్తాబ్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ పెట్టాడు. ఆమై దారుణానికి ఒడిగట్టిన గంట వ్యవధిలోనే ఇలా చేశాడని పోలీసులు గుర్తించారు. 

Shraddha Walker murder case.. Aftab ordered food online an hour after killing his girlfriend..
Author
First Published Nov 30, 2022, 1:42 PM IST

శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో రోజు రోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రియురాలిని హత్య చేసిన గంట తరువాత నిందితుడు అఫ్తాబ్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఈ విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తాజాగా కనుగొంది. 

మే 18న రాత్రి 9 గంటల సమయంలో నిందితుడు శ్రద్దాను హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. అయితే రాత్రి 10 గంటల సమయంలో అతడు ఫుడ్ ఆర్డర్ చేసినట్లు ఫోన్ రికార్డులు చెబుతున్నాయి. దీంతో హత్య చేసిన తేదీ విషయంలో అఫ్తాబ్ అబద్దం చెబుతున్నాడని, లేదా ఈ  హత్య ఒక ప్రణాళికా ప్రకారం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆమెను హత్య చేసిన తరువాత నిందితుడు ప్రశాంతంగా, సాధారణంగానే ఉన్నట్టు ఈ ఫుడ్ ఆర్డర్ వల్ల తెలుస్తోంది. 

అస్సాం యూనివర్సిటీ ర్యాగింగ్ కేసు.. ఆరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

ఓ హత్య వంటి ఒత్తిడితో కూడిన చర్యకు పాల్పడిన తర్వాత ఓ వ్యక్తి తినడం గురించి ఆలోచించడం పరిశోధకులకు ఆశ్చర్యం కలిగించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’పేర్కొంది. సాధారణంగా నిందితులెవరైనా ఇలాంటి పరిస్థితుల్లో కనీసం దాహం వేసినా దానిని పరిగణలోకి తీసుకోరని పోలీసులు తెలిపారు. 

‘‘ ఈ హత్య క్షణికావేశంలో జరిగిందని అఫ్తాబ్ పేర్కొన్నాడు. అయితే అతడు హత్య తేదీ విషయంలో అబద్దం చెబుతున్నాడా లేకపోతే అతడు ప్రశాతంగా ఉండటాన్ని గమనిస్తే ఈ హత్యను ముందుగానే ప్లాన్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు’’ అని పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. మే 18న శ్రద్ధా వాకర్ ను గొంతు నులిమి చంపినట్లు అఫ్తాబ్ చెబుతున్నాడని, కానీ పోస్టుమార్టం జరగకపోవడంతో హత్య జరిగిన ఖచ్చితమైన తేదీ తెలియడం లేదని పేర్కొన్నారు.

నిందితుడు ఫోన్ లో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లను పరిశోధకులు పరిశీలించారు. అయితే అతడు మెళ్లగా ఆర్డర్ చేసే క్వాంటిటీని తగ్గించాడని గుర్తించారు. ‘‘లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట ఛతర్పూర్ పహాడీలోని ఫ్లాట్ కు మారారు. అయితే ఆ సమయంలో అఫ్తాబ్ ఇద్దరికి సరిపోయేంత ఆహారాన్ని ఆర్డర్ చేసేవాడు. హత్య తరువాత దాని క్వాంటిటీని తగ్గించాడు. దీని వల్ల ఆ ఆహారాన్ని ఒకే వ్యక్తి మాత్రమే తిన్నట్టు తెలుస్తోంది ’’ అని వర్గాలు తెలిపాయి. ఆర్డర్ చేసిన ఆహారంలో పరిమాణం తగ్గుదల అనేది పరిశోధకులకు ఒక ముఖ్యమైన అంశం.

కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య..శవాన్ని ముక్కలుగా నరికి, వీధుల్లో పారేస్తూ కెమెరాకు చిక్కిన తల్లీకొడుకులు

మే 3-4 తేదీల్లో విడిపోదామని శ్రద్ధా పలుమార్లు పట్టుబట్టిందని అఫ్తాబ్ విచారణలో వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ అఫ్తాబ్ ఆమెను విడిచిపెట్టడానికి సిద్ధ పడలేదు. ‘‘అంతకు ముందే శ్రద్ధా ఈ రిలేషన్ షిప్ నుంచి వైదొలగాలని కోరుకుంది. కానీ నిందితుడు ఆమెను తనతోనే ఉండేలా ఒప్పించాడు. శ్రద్ధాను వేరే వ్యక్తితో చూడటాన్ని తాను భరించలేనని అఫ్తాబ్ విచారణలో అంగీకరించాడు’’ అని ఆ వర్గాలు వెల్లడించాయి.  

అయితే అఫ్తాబ్ ఢిల్లీకి చేరుకున్న తరువాత అతడు తన మొబైల్ ఫోన్ లో చేసిన యాక్టివిటీస్ గణనీయంగా తగ్గాయని దర్యాప్తులో తేలింది. బ్రౌజింగ్ హిస్టరీని కూడా అతడు క్లియర్ చేశారని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలతో పాటు దర్యాప్తు బృందం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరీక్షా నివేదికల కోసం ఎదురుచూస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios