Asianet News TeluguAsianet News Telugu

శ్రద్ధా వాకర్ హత్య కేసు: ఆ నిందితుడికి  14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. 

శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు అఫ్తాబ్‌ను అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు.

Shraddha Walkar murder case: Aftab Poonawala sent to 14 days in judicial custody
Author
First Published Nov 26, 2022, 5:20 PM IST

దేశవ్యాప్తంగా సంచలన సష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కీలక ఆధారం వెలుగులోకి వస్తోంది. తాజాగా కిరాతకానికి పాల్పడిన అఫ్తాబ్ పూనావాలా నిర్వాకం రోజుకొకటి బయట పడింది. శ్రద్ధ ను అత్యంత దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని 35 ముక్కలు చేశాడు. అనంతరం ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. అనంతరం ఓ అమ్మాయిని .. తన అద్దె ఇంటికి పిలిచి.. ఆమెతో అఫ్తాబ్ గడిపాడు. ఆ మహిళ గురించి విచారించగా.. ఆమె వృత్తిరీత్యా ఒక డాక్టర్ (సైకియాట్రిస్ట్) అని తెలిసింది. మొబైల్ డేటింగ్ అప్లికేషన్ ద్వారా ఆ యువతిని కలిసినట్టు గుర్తించారు.

ఇదిలా ఉంటే.. నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు అంబేద్కర్ ఆస్పత్రి నుంచి అఫ్తాబ్‌ను తీసుకెళ్లారు. ఆసుపత్రిలోనే కోర్టును ఏర్పాటు చేశారు. ఇక్కడే అఫ్తాబ్‌ను విచారించారు. అంబేద్కర్ ఆసుపత్రిలోనే కోర్టును ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులు మేజిస్ట్రేట్‌ను అభ్యర్థించారని స్పెషల్ సీపీ లా అండ్ ఆర్డర్ సాగర్‌ప్రీత్ హుడా తెలిపారు. వాస్తవానికి.. నిందితుడు అఫ్తాబ్ కు నార్కో పరీక్ష చేయాలని .. అతడ్ని ఢిల్లీ పోలీసు బృందం అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. 

ఈక్రమంలో అతడిని శనివారం (26 నవంబర్ 2022న) రోజున కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో  కోర్టు అఫ్తాబ్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని ఆదేశించింది. దీంతో  అఫ్తాబ్ ను తీహార్ జైలుకు పంపనున్నారు. కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రద్ధా హత్య కేసు మిస్టరీ ఇంకా చిక్కుముడి వీడుతోందనీ, నిందితుడు అఫ్తాబ్ తన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించినప్పటికీ, అనేక ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రం దొరకడం లేదు. కోర్టులో అఫ్తాబ్‌ను దోషిగా రుజువు చేసే సాక్ష్యాధారాలు ఢిల్లీ పోలీసులకు ఇంకా లభించలేదని అంటున్నారు.  

శ్రద్ధా హత్య ఢిల్లీలో జరిగిందని, అయితే కుట్ర అంతా హిమాచల్‌లోనే జరిగిందని ఢిల్లీ పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ఐదు రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని శ్రద్ధా, అఫ్తాబ్ సన్నిహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.గురుగ్రామ్‌లో కూడా విచారిస్తున్నారు. శ్రద్ధ హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పోలీసులు చాలాసార్లు వెతికారు.

ఈ కేసులో కొత్త విషయాలు తెరపైకి రావడం గమనార్హం. శ్రద్ధను హత్య చేసి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికినట్లు విచారణలో అఫ్తాబ్ చెప్పాడు. ఆ తర్వాత మృతదేహం ముక్కలను మెహ్రౌలీ అడవుల్లో పడేశారు. అఫ్తాబ్ పేర్కొన్న ప్రదేశాలలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే మరిన్ని ఖచ్చితమైన ఆధారాలు ఇంకా వెతుకుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios