మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తికి శివసైనికులు గుండు గీయించారు.

వివరాల్లోకి వెళితే... జామియా మిలియా సంఘటనను జలియన్ వాలాబాగ్‌తో పోల్చడాన్ని తప్పుబడుతూ వడాలా ప్రాంతానికి చెందిన హీరామాయి తివారీ... అనే వ్యక్తి ఉద్దవ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Also Read:సీఎంల ఓటమి చరిత్ర మరోసారి రిపీట్.... ఓటమి అంచున రఘుబర్ దాస్

దీనిపై ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు 25 నుంచి 30 మంది అతనిని చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. అక్కడి ఆగకుండా తివారీని నడిరోడ్డుపై కూర్చోబెట్టి గుండు గీసి పంపించారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే మొదట కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తర్వాత కేసును ఉపసంహరించుకోవాలని తివారీపై ఒత్తిడి చేశారు. దీనిపై వెనక్కు తగ్గని తివారీ శివసైనికులపై కేసును విత్‌డ్రా చేసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు. కాగా పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మద్ధతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో మాత్రం యూటర్న్ తీసుకుంది.

Also Read:ఝార్ఖండ్ లో కూడా శరద్ పవార్ వేలు... మరో మహారాష్ట్ర?

పెద్దల సభలో చర్చలో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పౌరసత్వ బిల్లుకు మద్ధతు తెలపని వారిపై దేశద్రోహుల ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో జాతీయ వాదానికి, హిందుత్వ వాదానికి ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని సంజయ్ వ్యాఖ్యానించారు.