Asianet News TeluguAsianet News Telugu

ఝార్ఖండ్ లో కూడా శరద్ పవార్ వేలు... మరో మహారాష్ట్ర?

ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికర అంశం ఉంది. ఝార్ఖండ్ తూర్పున ఉన్న రాష్ట్రం. మహారాష్ట్ర పశ్చిమాన ఉన్న రాష్ట్రం. అక్కడ మహారాష్ట్రలో ప్రస్తుతానికి ఒక ప్రాంతీయ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ప్రభుత్వం లో భాగస్వామి అయినా ఎన్సీపీ ఇక్కడ ఒక సీట్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. 

sharad pawar NCP party candidate kamlesh kumar singh inches towards victory
Author
Hussainabad, First Published Dec 23, 2019, 2:43 PM IST

హుస్సేనాబాద్: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతానికి ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ కనపడడం లేదు.  జేఎంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి ఒకింత దూసుకుపోతున్నట్టు కనపడతున్నప్పటికీ, దాదాపుగా 20 స్థానాల్లో గతసారి చాలా తక్కువ మెజారిటీ తో అక్కడ అభ్యర్థులు గెలిచారు.

ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికర అంశం ఉంది. ఝార్ఖండ్ తూర్పున ఉన్న రాష్ట్రం. మహారాష్ట్ర పశ్చిమాన ఉన్న రాష్ట్రం. అక్కడ మహారాష్ట్రలో ప్రస్తుతానికి ఒక ప్రాంతీయ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ప్రభుత్వం లో భాగస్వామి అయినా ఎన్సీపీ ఇక్కడ ఒక సీట్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. 

హుస్సేనాబాద్ నియోజకవర్గంలో ఎన్సీపీ పార్టీకి చెందిన కమలేష్ కుమార్ సింగ్ లీడింగ్ లో ఉన్నారు. అక్కడ  జేఎంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి తో బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్న వేళ ఇలా ఒక చిన్న పార్టీ ఒక సీట్లో ఆధిక్యాన్ని ప్రదర్శించడం నిజంగా ఆసక్తికర అంశం. 

ఈ సీట్ లో కమలేష్ కుమార్ సింగ్ సమీప ప్రత్యర్థి బీఎస్పీ అభ్యర్థి షేర్ అలితోని నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాడు. ఈ స్థానంలో బీజేపీ పోటీ చేయలేదు. బదులుగా స్వతంత్ర అభ్యర్థి వినోద్ కుమార్ ని సపోర్ట్ చేసింది. 

పోటీ మాత్రం ఎన్సీపీ, బీఎస్పీ ల మధ్యనే ప్రధానంగా నడుస్తుంది. ప్రస్తుతానికి ఎన్సీపీకి చెందిన కమలేష్ కుమార్ సింగ్ గెలిచేలా కనబడుతున్నారు. ఆయన గతంలో కూడా ఈ సీట్లో ఇదే పార్టీ టికెట్ పై గెలవడం జరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి భారీ మెజారిటీ తో గెలవడం జరిగింది. 

ఈ నియోజకవర్గంలో దళితుల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఝార్ఖండ్ లోని ఎస్సి బెల్ట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వచ్చి ప్రచారం చేయకున్నప్పటికీ మరో మారు శరద్ పవార్ పేరు ఇక్కడ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఝార్ఖండ్ లో కూడా శరద్ పవార్ వేలు పెట్టడం ప్రారంభించాడని అందరూ అనుకుంటున్నారు. 

మహారాష్ట్రలో బీజేపీకి షాక్ ఇస్తూ శివసేన, కాంగ్రెస్ లను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో శరద్ పవార్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఝార్ఖండ్ కూడా మరో మహారాష్ట్ర అవనుందా... బీజేపీ చేతిలో నుంచి జారిపోతుందా అని అక్కడి వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios