సీఎంల ఓటమి చరిత్ర మరోసారి రిపీట్.... ఓటమి అంచున రఘుబర్ దాస్

రఘుబర్ దాస్ తన ప్రత్యర్థి సరయు రాయ్ కన్నా చాలా వెనకబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల సంఘం సమాచారం మేరకు 8000 ఓట్ల వెనుకంజలో ఉండగా అందుతున్న సమాచారం మేరకు 12,000 ఓట్ల వెనుకంజలో ఉన్నారని అక్కడి లోకల్ సమాచారం. ఝార్ఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఓడిపోవడం అనేది జరుగుతూనే ఉంది. ఇది తొలిసారి మాత్రం కాదు.

no cm has won twice in jharkhand and raghubar das too follows the trend

రాంచి: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 5 దశల్లో జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ నేటి ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో 41 స్థానాలను దక్కించుకున్న పార్టీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కిచ్చుకుంటుంది. 

జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన తన సహచర క్యాబినెట్ మంత్రి సరయు రాయ్ తో తలపడుతున్న విషయం తెలిసిందే. 

బీజేపీ నుంచి రెబెల్ గా బరిలోకి దిగి ఆయన రఘుబర్ దాస్ కి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరకు అందుతున్న సమాచారం మేరకు రఘుబర్ దాస్ తన ప్రత్యర్థి సరయు రాయ్ కన్నా చాలా వెనకబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల సంఘం సమాచారం మేరకు 8000 ఓట్ల వెనుకంజలో ఉండగా అందుతున్న సమాచారం మేరకు 12,000 ఓట్ల వెనుకంజలో ఉన్నారని అక్కడి లోకల్ సమాచారం. 

Also read: ఝార్ఖండ్ లో కూడా శరద్ పవార్ వేలు... మరో మహారాష్ట్ర?

ఝార్ఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఓడిపోవడం అనేది జరుగుతూనే ఉంది. ఇది తొలిసారి మాత్రం కాదు. 2008లో శిబూ సొరేన్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సిన సందర్భంలో ఆయన ఓటమి చెందారు. 

2014లో ఝార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబూలాల్ మారండి రెండు సీట్ల నుండి పోటీ చేసారు. రెండింటిలోనూ ఓటమి చెందారు. అర్జున్ ముండా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ...ఆయన కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. 

మరో మాజీ ముఖ్యమంత్రి మధు కొద కూడా 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. అన్ని కలిసి వస్తే ఈ సారి ముఖ్యమంత్రి కాబోయే హేమంత్ సొరేన్ కూడా 2014లో ఓటమి చెందారు. 2014లో ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే ఆయన డుమ్కి సీట్లో ఓటమి చెందారు. ఆశ్చర్యంగా ఆయన ఈ పర్యాయం కూడా ఈ రెండు సీట్ల నుంచే పోటీ చేస్తుండడం విశేషం. 

ఈ సరి రఘుబర్ దాస్ కూడా అదే చరిత్రను రిపీట్ చేస్తూ... ఆయన కూడా ఓటమి బాటలో పయనిస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి కేవలం 19 సంవత్సరాలే అయినప్పటికీ .... 6 గురు ముఖ్యమంత్రులను చూసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios