Asianet News TeluguAsianet News Telugu

ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (ఎల్) చీఫ్‌గా శివపాల్ సింగ్ యాదవ్ కుమారుడు ఆదిత్య నియామ‌కం..

ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) కు కొత్త అధ్యక్షుడిగా శివపాల్ సింగ్ యాదవ్ తనయుడు ఆదిత్య నియామకం అయ్యారు. త్వరలోనే పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ పేర్కొంది. 

Shivpal Singh Yadav's son Aditya has been appointed as the chief of the Pragatisheel Samajwadi Party (L).
Author
Lucknow, First Published Aug 10, 2022, 4:34 PM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) చీఫ్ గా శివపాల్ సింగ్ యాదవ్ కుమారుడు ఆదిత్య పార్టీ రాష్ట్ర చీఫ్‌గా నియమితులయ్యారు. ఈ మేర‌కు ఆ పార్టీ అధికారికంగా ఈ నియామకానికి సంబంధించి అపాయింట్ మెంట్ లెట‌ర్ ను ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది. త్వ‌ర‌లోనే పార్టీ కార్య‌క‌వ‌ర్గం ఏర్ప‌డుతుంద‌ని అందులో పేర్కొంది. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గిరిజ‌నుల‌పై అటవీ అధికారుల కాల్పులు.. ఒక‌రు మృతి, ప‌లువురికి గాయాలు

శివ‌పాల్ సింగ్ యాద‌వ్ స‌మాజ్ వాదీ పార్టీ అధ్య‌క్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కు మేనమామ‌. అయితే ఆయ‌న‌తో ఏర్ప‌డ్డ విభేదాల వ‌ల్ల శివపాల్ సింగ్ యాద‌వ్ 2018లో ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా)ని స్థాపించారు. కానీ 2022 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీని ఓడించాల‌నే ఉద్దేశంతో అఖిలేష్ యాద‌వ్ తో ఆయ‌న మ‌ళ్లీ కలిశారు. శివ‌పాల్ యాద‌వ్ కూడా ఎమ్మెల్యేగా త‌న పార్టీ నుంచి పోటీ చేయ‌లేదు. జ‌స్వంత‌న‌గ‌ర్ స్థానం నుంచి స‌మాజ్ వాదీ పార్టీ త‌రుఫున పోటీ చేసి గెలుపొందారు. 

ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం నుంచి వీరి మ‌ధ్య మ‌ళ్లీ విభేదాలు మొద‌ల‌య్యాయి. ప‌లు స‌మావేశాల‌కు అఖిలేష్ యాద‌వ్ త‌న మేన‌మామ‌ను దూరంగా ఉంచ‌డం, ఆయ‌న‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఈ విభేదాలు మ‌ళ్లీ ఒక్క సారిగా తెర‌పైకి వ‌చ్చాయి. 

పంద్రాగస్ట్ వేడుకలు.. త్రివర్ణ పతాకం కాదు, సిక్కు జెండా ఎగురేయండి : అకాలీదళ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ ప్ర‌తిపక్షాల అభ్య‌ర్థిగా ఉన్న య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్దతు ఇచ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు ఆయ‌న వ‌చ్చినప్పుడు స‌మావేశం కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ స‌మావేశానికి శివ‌పాల్ సింగ్ యాద‌వ్ కు ఆహ్వానం అందలేదు. దీనిపై ఆయ‌న స్పందించారు. తనను ఎవరైతే సమావేశానికి పిలుస్తారో వారికే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌న మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీనిని బీజేపీ ఉప‌యోగించుకుంది. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ద్రౌప‌ది ముర్ముతో స‌మావేశం ఏర్పాటు చేసిన‌ప్పుడు శివ‌పాల్ సింగ్ యాద‌వ్ ను ఆహ్వానించారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం 21 నుంచి ఎన్నికలు.. ఈ సారి రాహుల్ గాంధీకి సమ్మతమేనా?

అప్ప‌టి నుంచి ప‌లు సంద‌ర్భాల్లో అఖిలేష్ యాద‌వ్ పై శివ‌పాల్ సింగ్ యాద‌వ్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో స‌మాజ్ వాదీ పార్టీ బ‌ల‌హీన ప‌డుతోంద‌ని అన్నారు. పార్టీ చీఫ్ ఏసీ గ‌దుల్లో కూర్చొని నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని అన్నారు. కింది స్థాయిలో ఏం జ‌రుగుతోందో ఆయ‌న‌కు తెలియ‌డం లేద‌ని శివ‌పాల్ యాద‌వ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న స‌మాజ్ వాదీ పార్టీతో తెగ‌దింపులు జ‌రుపుకుంటార‌ని అంద‌రూ భావించారు. ప్ర‌స్తుతం శివ‌పాల్ సింగ్ యాద‌వ్ త‌న సొంత పార్టీని బ‌ల‌ప‌ర్చుకునే ప‌నిలో ప‌డ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios