‘‘నా పేరులోనే శివుడు.. మా సీఎం పేరులో రాముడు.. మాకెవ్వరూ చెప్పొద్దు..’’- డీకే శివ కుమార్
తమ సీఎం పేరులో రాముడు, తన పేరులో శివుడు ఉన్నారని కర్ణాటక (karnataka) డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ( DK Shiva kumar)అన్నారు. తమకు ఎవరూ బోధించకూడదని అన్నారు. తమ కర్తవ్యం ఏంటో తమకు తెలుసు అని చెప్పారు.
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంకా మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నమెంట్ ఆఫీసులకు, స్కూల్స్, కాలేజీలకు జనవరి 22వ తేదీన సెలవు ప్రకటించాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం సెలవు ప్రకటించలేదు. ఇందులో కర్ణాటక రాష్ట్రం కూడా ఉంది. ఈ నిర్ణయాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వరకే ప్రకటించినా.. మరో సారి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో సమర్థించుకున్నారు.
వావ్.. అంతరిక్షం నుంచి అయోధ్య ఆలయాన్ని ఫొటో తీసిన ఇస్రో శాటిలైట్.. ఎలా ఉందో చూశారా ?
తమకు భక్తి, ఉందని, రాముడు, మతం అంటే గౌరవం ఉన్నాయని డీకే శివ కుమార్ అన్నారు. కానీ తాము దానిని ప్రచారం చేసుకోవడం లేదని తెలిపారు. తమ మంత్రులు కూడా దేవాలయాల్లో పూజలు చేస్తున్నారని చెప్పారు. తమ ప్రార్థనలు ఫలిస్తాయని, ప్రతీ ఒక్కరూ ప్రార్థనలు చేయాలని కోరుతున్నామని అన్నారు.
తమ సీఎం సిద్ధరామయ్య పేరులో రాముడు, తన పేరులోనే శివుడు ఉన్నారని అన్నారు. తమకు ఎవరూ బోధించకూడదని, తమని ఒత్తిడి చేయకూడదని అన్నారు. కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తామని తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలని కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు నిర్ణయించలేదని మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు కావాలో నిర్ణయించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పిక్ అండ్ ఛాయిస్ పద్ధతిని అనుసరించిందని ఆరోపించారు.
ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ.. లండన్ లో రేవంత్ రెడ్డి, ఒవైసీ భేటీ వెనకున్న మతలబేంటి ?
దేశంలో చాలా మంది నాయకులు, ముఖ్యమంత్రులు ఉన్నా.. బీజేపీ నేతలకు ఆహ్వానం అందిందని డీకే శివ కుమార్ అన్నారు. రామాలయం ప్రైవేటు ఆస్తి కాదని, అది పబ్లిక్ ప్రాపర్టీ అని అన్నారు. ప్రతీ మతం, చిహ్నం ఏ వ్యక్తికి చెందినది కాదని తెలిపారు. కాగా.. అయోధ్యలో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు ఇద్దరూ హాజరుకావడం లేదు.