ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ.. లండన్ లో రేవంత్ రెడ్డి, ఒవైసీ భేటీ వెనకున్న మతలబేంటి ?

లండన్ (london)లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy)తో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)  భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్ సభ ఎన్నికల (lok sabha elections 2024) నేపథ్యంలో ఎంఐఎంను మచ్చిక చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చర్చ జరుగుతోంది. 

Congresss friendship with MIM.. What was the motive behind the meeting between Revanth Reddy and Owaisi in London?..ISR

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం లండన్ లో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. హైదరాబాద్ లో మూసీ నది పునరుజ్జీవం కోసం థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు తెలంగాణ సీఎం ఒవైసీని లండన్ కు ఆహ్వానించారని అధికారులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్-ఎంఐఎం మధ్య విభేదాలను తొలగించుకొని, గతంలో మాదిరిగా కలిసిపోయేందుకే వారి ఇరువురి భేటీ జరిగిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 

హైదరాబాద్ లోనూ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు.. ఎక్కడంటే ?

తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వలేదు. అయినప్పటికీ ఎన్నికల అనంతరం అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సిఫారసు చేసింది. అప్పటి నుంచి ఎంఐఎంను మచ్చిక చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఊహాగానాలు మొదలు అయ్యాయి. 

అంబానీ నివాసంపై ‘జై శ్రీరామ్’.. ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ముస్తాబైన ఆంటిలియా..

కాంగ్రెస్ తో పొత్తు లేదని ఎంఐఎం స్పష్టం చేసిన తర్వాత కొంత కాలం పుకార్లు వినపించలేదు. అయితే తాజాగా లండన్ లో తెలంగాణ సీఎం, అక్బరుద్దీన్ ఒవైసీల భేటీ తర్వాత అవి మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం ఎంఐఎంతో దోస్తీ కట్టాలని భావిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఇండియా కూటమికి తెలంగాణలోని 17 స్థానాలు చాలా కీలకం కానున్నాయి. 

షోయబ్ తో విడాకులు నిజమే.. కొత్త జంటకు విషెష్ చెప్పిన సానియా మీర్జా..

అందుకే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గాను 12 స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 12 లోక్ సభ స్థానాలను కైవంసం చేసుకోవాలని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ నేతలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. అయితే 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గాను కేవలం మూడింటినే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా ? లేక ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుందా అనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్థంగా మారింది. 

కాగా.. థేమ్స్ నదిని అధ్యయనం చేయడానికి రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ 309 మీటర్ల ఎత్తైన ఆకాశహర్మ్యమైన లండన్ శార్డ్ ను సందర్శించిన ఫోటోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం మూసీ నది పునరుజ్జీవనంపై ప్రజెంటేషన్ ను ముఖ్యమంత్రితో కలిసి చూస్తున్న వీడియో క్లిప్ ను ఒవైసీ షేర్ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios