Asianet News TeluguAsianet News Telugu

‘‘గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారు ?’’ - తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు శివసేన ఎంపీ సంజ‌య్ రౌత్ వార్నింగ్

అస్సాం రాష్ట్రం గౌహతిలోని ఓ రిసార్ట్ లో ఉంటున్న 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత కాలం గౌహతిలో దాక్కుంటారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

Shiv Sena MP Sanjay Routh warns rebel MLAs on how long they will be hiding in Guwahati
Author
Mumbai, First Published Jun 26, 2022, 11:55 AM IST

మ‌హారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకూ తీవ్రమ‌వుతోంది. కొత్త కొత్త ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో దాదాపు 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్సాం రాష్ట్రం గౌహ‌తిలోని ఓ విలాస‌వంత‌మైన రిసార్ట్ లో క్యాంపు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారిపై శివసేన ఎంపీ, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ తిరుగుబాటు దారుల‌పై మండిప‌డ్డారు. ఎంత‌కాలం గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారని ప్రశ్నించారు.

భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరులూదిన బార్డోలీ సత్యాగ్రహ

అస్సాంలో ఉంటున్న 40 మంది ఎమ్మెల్యేలు మ‌హా వికాస్ అఘాడీ (MVA) ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టారు. ‘‘ మీరు గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారు ? మీరు చౌపట్టికి తిరిగి రావాలి ’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. శివసేన అనర్హత పిటిషన్‌పై 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ చిత్రాన్ని కూడా ఆయ‌న ఈ ట్వీట్ తో షేర్ చేసుకున్నారు. జిర్వాల్ శనివారం షిండేతో సహా 16 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అసమ్మతి శాసనసభ్యులు తమ లిఖితపూర్వక సమాధానాలను దాఖలు చేసేందుకు సోమవారం వరకు గడువు ఇచ్చారు.

మహారాష్ట్ర వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం శివసేనలో తిరుగుబాటుకు, రాష్ట్రంలోని రాజకీయ అస్థిరతకు ప్రతిపక్ష బీజేపీని నిందించింది. అయితే కాషాయ పార్టీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ సంక్షోభంలో తమ పాత్ర లేదని పేర్కొంది. బీజేపీ ఈ తిరుగుబాటును ప్రారంభించలేదని లేదా మద్దతు ఇవ్వలేదని ఫడ్నవీస్ తనతో చెప్పారని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే శనివారం స్ప‌ష్టం చేశారు. అథ‌వాలే శ‌నివారం ఫ‌ఢ్న‌వీస్ ను క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ‘‘ రాష్ట్ర మంత్రి, శివసేన తిరుగుబాటుదారుడు ఏక్  నాథ్ షిండే కు మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తద్వారా MVA ప్రభుత్వం మైనారిటీకి పడిపోయింది. ఈ అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఏమీ లేదు. బీజేపీ ఈ తిరుగుబాటును ప్రారంభించలేదు. అలాగని మద్దతు కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో బీజేపీ వేచి చూస్తుందని ఆయన (ఫడ్నవీస్) నాకు చెప్పారు.’’

Agnipath : అగ్నిప‌థ్ ను ఏటా ప్ర‌భుత్వం స‌మీక్షిస్తుంది.. లోపాల‌ను స‌రి చేస్తుంది - రాజ్ నాథ్ సింగ్

 ఇదిలా ఉండ‌గా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల ఆఫీసుల‌పై సేన కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోతున్నారు. ఉస్మానాబాద్‌లో కూడా ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఎమ్మెల్యే సందీపన్ బుమ్రే కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూణేలో ఉన్న ఎమ్మెల్యే తానాజీ సావంత్ ఆఫీసులో కూడా విధ్వంసం సృష్టించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దేశద్రోహులుగా పేర్కొంటూ వారి కార్యాలయాలపై దాడులు చేస్తామని శివసేనకు చెందిన పూణె ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు సంజయ్ మోరే హెచ్చరించారు. ఆఫీసుల‌పై ఈ దాడుల నేప‌థ్యంలో పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలోని ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో ఉన్న అన్ని రాజకీయ కార్యాలయాల వద్ద పోలీసు భ‌ద్ర‌త‌ను పెంచారు. ముంబాయి, థానే జిల్లాలో 144 సెక్ష‌న్ విధించారు. థానేలోని శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నివాసం వెలుపల భద్రతను పెంచారు. రెబల్ ఎమ్మెల్యేల ఇళ్ల‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios