Asianet News TeluguAsianet News Telugu

షిర్డీ వివాదం: రేపు ఉద్ధవ్ థాక్రే‌తో షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ భేటీ, సర్వత్రా ఉత్కంఠ

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిసాయి జన్మభూమి విషయంలో వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను సోమవారం షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ కలవనుంది. 

shirdi sansthan trust to meet maharashtra cm uddhav thackeray on january 20th
Author
Mumbai, First Published Jan 19, 2020, 2:55 PM IST

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిసాయి జన్మభూమి విషయంలో వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను సోమవారం షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ కలవనుంది. అలాగే సాయినాథుని జీవితం, షిర్డీతో అనుబంధం తదితర విషయాలకు సంబంధించి ఉన్న ఆధారాలను సీఎంకు సమర్పించనున్నారు. 

కాగా సాయి బాబా జన్మస్థలంగా కొందరు భక్తులు భావిస్తోన్న పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఆ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read:సాయి జన్మభూమి వివాదం: షిరిడీలో కొనసాగుతున్న బంద్... అత్యవసరంగా సమావేశమైన మహా సీఎం

పత్రిని అభివృద్ధి చేస్తే.. షిరిడీ ప్రాధాన్యం తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ షిర్డీలో బంద్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో షిరిడీ ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తారని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి

దీనిపై స్పందించిన షిర్డీ సంస్థార్ ట్రస్ట్.. ఆదివారం నుంచి ఆలయాన్ని మూసివేస్తారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. బాబాకు ఎప్పటిలాగే హారతి, ప్రత్యక పూజలు కొనసాగుతాయని ఆలయంలో భక్తుల దర్శనాలు సైతం రోజులాగే కొనసాగుతాయని క్లిరాటీ ఇచ్చింది.

Also Read:సాయి జన్మస్థలంపై వివాదం... షిరిడీ ఆలయం నిరవధికంగా మూసివేత

మరోవైపు ఈ వివాదం నిదానంగా రాజకీయ రంగు పులుముకుంది. శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సాయి బాబా జన్మస్థలాన్ని వివాదంలోకి లాగుతోందని బీజేపీ మండిపడింది. షిర్డీ ప్రజలు న్యాయపోరాటానికి దిగుతారని అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios