షిర్డీ సాయి భక్తులను నిరసపరిచే వార్త ఇది. భక్తులకు ఆలయ ట్రస్ట్ షాక్ ఇచ్చింది. రేపటి  నుంచి  అంటే జవనరి 19వ తేదీ నుంచి సాయి బాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. సాయి జన్మస్థలం ‘పత్రి’ని ప్రభుత్వం అభివృద్ధి చేసే నిర్ణయాన్నిప్రకటించారు. దీని వ్యతిరేకిస్తూ  షిరిడీ గ్రామస్థులంతా సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా సాయి దర్శనానికి వచ్చే వారు సందిగ్ధంలో పడిపోయారు.  

Also Read నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి.

సాయి బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. గతంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే ‘పత్రి’ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో షిర్డీ ఆలయ ప్రాధాన్యం తగ్గుతుందని ఆలయ నిర్వాహకులు నిరసనకు సిద్ధమయ్యారు. 

షిర్డీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఆలయంలో అన్ని కార్యక్రమాలూ నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో అనూహ్యమైన పరిస్థితి ఏర్పడింది. కాగా పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కానీ దీనిపై షిర్డీ గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతున్నారు