Asianet News TeluguAsianet News Telugu

సాయి జన్మభూమి వివాదం: షిరిడీలో కొనసాగుతున్న బంద్... అత్యవసరంగా సమావేశమైన మహా సీఎం

సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. పత్రి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు ఆదివారం షిరిడి పట్టణ బంద్‌ కు షిర్డీ గ్రామ వాసులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అక్కడ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉద్ధవ్ సర్కార్ షిరిడీపై స్పష్టమైన ప్రకటన చేసేవరకు తాము వెనక్కి తగ్గబోమని షిరిడీవాసులు డిమాండ్ చేస్తున్నారు.  

sai baba's birth place row: shirdi bandh continues peacefully
Author
Shirdi, First Published Jan 19, 2020, 11:54 AM IST

మొన్నటిదాకా సాయిబాబా హిందూ దేవుడా కదా అనే ఒక చర్చ సంచలనం రేపింది. ఇప్పుడది సమసిపోయింది అనుకోగానే మరోసారి సాయిబాబా చుట్టూ మళ్ళీ వివాదాలు అలుముకుంటున్నాయి. ఈ సారి సాయిబాబాపై కాకుండా ఆయన జన్మభూమి, కర్మభూమిలపై వివాదం రాజుకుంది.  

సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. పత్రి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు ఆదివారం షిరిడి పట్టణ బంద్‌ కు షిర్డీ గ్రామ వాసులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అక్కడ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉద్ధవ్ సర్కార్ షిరిడీపై స్పష్టమైన ప్రకటన చేసేవరకు తాము వెనక్కి తగ్గబోమని షిరిడీవాసులు డిమాండ్ చేస్తున్నారు.  

Also read: సాయి జన్మస్థలంపై వివాదం... షిరిడీ ఆలయం నిరవధికంగా మూసివేత

షిరిడీలో బంద్ కొనసాగుతున్నప్పటికీ, ఆలయం తెరిచే ఉంటుందని, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ నిన్ననే పేర్కొంది. చెప్పినట్టుగానే ఆలయంలో అన్ని పూజ కైంకర్యాలు కొనసాగుతున్నాయి. 

సంస్థాన్‌కు చెందిన ఆస్పత్రులు, ప్రసాద విక్రయ కేంద్రాలు, భక్తి నివాసాలు తదితరాలన్నింటిలో కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ఉండగా, ఈ వివాదం పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సెక్రటేరియట్‌లో మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

సాయిబాబా జన్మస్థలంగా భక్తులు భావించే పత్రి అభివృద్ధికి మహారాష్ట్ర సర్కార్ 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం వివాదమైంది. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, షిర్డీ వాసులు శనివారం సమావేశమయ్యారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనకు నిరసనగా ఆదివారం నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. బంద్‌ ప్రభావం కేవలం షిరిడి ఒక్క పట్టణానికి మాత్రమే కాకుండా సమీప గ్రామాల్లో కూడా కనబడుతుంది.  

గతంలో కూడా ఇలా బాబా జన్మస్థలంపై వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని షిరిడి వాసులు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన సాయిబాబా ఆలయాలు ఎలాగో, పత్రిలోని ఆలయం కూడా అలాంటిదేనని, వారు అన్నారు.  

బాబా జన్మస్థానం పత్రి అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని షిరిడి గ్రామ వాసులు ఆక్షేపిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడం ఏమిటని వారు మంది పడుతున్నారు. 

బంద్ పాటిస్తున్నప్పటికీ బయట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా... హోటళ్లలో ముందుగా బుకింగ్‌ చేసుకున్న భక్తులకు, విమానాల్లో, రైళ్లలో ఇతర ప్రాంతాల నుంచే వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బస్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. దుకాణాలు మాత్రమే మూతబడి ఉన్నాయి. 

పత్రి సాయి జన్మస్థలం అనడానికి ఆధారాలున్నాయి...  

ఎన్సీపీ నేత, ఎమ్మెల్సీ దుర్రానీ మాట్లాడుతూ.... పత్రిలోనే బాబా జన్మించారనేందుకు చారిత్రక ఆధారాలున్నాయని ఈయన చెప్పారు. పత్రి జన్మభూమి కాగా, షిర్డీ సాయిబాబా కర్మభూమి అని, రెండు ప్రాంతాలూ భక్తులకు ముఖ్యమైనవేనని తెలిపారు.  

పత్రి కి ప్రాధాన్యం పెరిగితే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందేమోనని షిర్డీ ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.  కాంగ్రెస్ నేత, ప్రస్తుత మంత్రి అశోక్‌ చవాన్‌ మాట్లాడుతూ..సాయిబాబా జన్మస్థలంపై వివాదం కారణంగా కేవలం షిరిడి ఒక్కటే క్షేత్రం అని చూపుతూ... పత్రిలో భక్తులకు సౌకర్యాలను కల్పించడాన్ని అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios