దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా దేవాలయం 2019లో హుండీ ఆదాయం రూ.287 కోట్లు వచ్చింది. 2019 జనవరి ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు భక్తులు కానుకలు, మొక్కుల రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈవో దీపక్ ముగ్లికర్ వెల్లడించారు.

ఈ మొత్తంలో రూ.217 కోట్లు ధనరూపంలో రాగా.. ఎక్కువగా చెక్కులు, డీడీలు, మనియార్డర్లు, క్రెడిట్-డెబిట్ కార్డులు, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్లు, విదేశీ కరెన్సీ వంటి రూపాల్లో వచ్చాయన్నారు.

అభరణాలు, నాణేల రూపంలో 19 కిలోల బంగారం, 391 కిలోల వెండి వస్తువులను బాబాకు సమర్పించారు. కాగా సాయిబాబా మహా సమాధి చెంది 2018కి 100 ఏళ్లు అయిన సందరభంగా ఏడాది పొడవునా షిర్డీలో ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ లాంటి వీవీఐపీలు సహా కోటి మందికి పైగా భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. 

Also Read:

చంద్రయాన్-3కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. పని మొదలైంది: ఇస్రో చీఫ్ శివన్

స్కూటర్ పై ప్రియాంక గాంధీ, ఫైన్ వేసిన పోలీసులు: స్కూటర్ ఓనర్ మాట ఇదీ...

కమల్ హాసన్ కి చెక్... గౌతమిని రంగంలోకి దింపిన బీజేపీ