Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్-3కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. పని మొదలైంది: ఇస్రో చీఫ్ శివన్

ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్. కె. శివన్ ప్రకటించారు. 

Work has begun on Chandrayaan-3 mission: ISRO chief K Sivan
Author
Bangalore, First Published Jan 1, 2020, 2:58 PM IST

ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్. కె. శివన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఆయన బెంగళూరులో తెలిపారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్, చంద్రయాన్-2 తరహాలోనే ఉంటుందన్నారు.

చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయని.. చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన ల్యాండర్, రోవర్ ఉంటాయని శివన్ వెల్లడించారు. గగన్‌యాన్, చంద్రయాన్-3 ప్రాజెక్టులతో 2020 ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:విక్రమ్ ల్యాండర్ ఆచూకీ: కీలకపాత్ర పోషించిన చెన్నై టెక్కీ

2019లో ఇస్రో అనేక విజయాలు సాధంచిందని ఆయన గుర్తుచేశారు. 2019లో గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో ఎంతో పురోగతి సాధించామని.. ఇందుకోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నలుగురిని ఎంపిక చేశామన్నారు. వారికి రష్యాలో ఈ నెల మూడోవారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని.. ఈ ఏడాది విస్తరణపై దృష్టిపెట్టామని శివన్ వెల్లడించారు.

మరిన్ని మిషన్లు ఇస్రో సామర్ధ్యాన్ని పెంచే దిశగా సాగుతున్నామని.. రెండో స్పేస్ పోర్ట్‌ నిమిత్తం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో భూసేకరణ చేశామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-3 ప్రయోగానికి కేంద్రప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించిందని శివన్ తెలిపారు.

Also Read:మాకు అండగా నిలిచినందుకు దన్యవాదాలు... ఇస్రో

చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ను 2020లోనే చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్-2ను విఫల ప్రాజెక్ట్‌గా పరిగణించడం తగదని... ప్రపంచంలో ఏ దేశమూ తొలి ప్రయత్నంలోనే చందమామపై ల్యాండర్‌ను దించలేకపోయిందని జితేంద్ర గుర్తుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios