Asianet News TeluguAsianet News Telugu

నిద్రపోవడానికి మద్యం తాగానని శంకర్ మిశ్రా చెప్పాడు - మహిళపై మూత్ర విసర్జన ఘటనలో ప్రత్యక్ష సాక్షి

ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా ఫుల్లుగా మద్యం తాగి ఉన్నాడని ఆయనతో పాటు ప్రయాణించిన యూఎస్ డాక్టర్ ఒకరు తెలిపారు. ఈ ఘటనలో తాను ఎయిర్ లైన్స్ కు ఫిర్యాదు చేశానని, కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా పోయిందని చెప్పారు. 

Shankar Mishra says he drank alcohol to sleep - eyewitness to urinate incident on woman
Author
First Published Jan 9, 2023, 1:08 PM IST

ఎయిర్ ఇండియా న్యూయార్క్- ఢిల్లీ విమానంలో ఒక మహిళపై మూత్ర విసర్జన చేసినందుకు గత నెలలో అరెస్టయిన శంకర్ మిశ్రా కు సంబంధించిన పలు విషయాలను ఆ విమానలో ప్రయాణించిన యూఎస్ డాక్టర్ సుగత భట్టాచార్య వెల్లడించాడు. ఆయన ‘ఎన్డీటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన నవంబర్ 26 విమానంలో బిజినెస్ క్లాస్‌లో శంకర్ మిశ్రా పక్కన కూర్చుని ప్రయాణించారు.

తాంత్రికుడి మాటలు విని నాలుగు నెలల కుమారుడిని కాళీమాతకు బలిచ్చిన తల్లి.. యూపీలో ఘటన

“ అతడు నన్ను చాలాసార్లు అదే ప్రశ్నలు అడిగాడు. అతడు అస్థిరంగా ఉన్నాడని నాకు అర్థమైంది. ఈ విషయం నేను సిబ్బందికి తెలియజేశాను. దీంతో అతడు నవ్వాడు.’’ అని డాక్టర్ తెలిపారు. అతడు చాలా రోజులు నిద్రపోలేదని, అందుకే సరిగా నిద్రపోయేందుకు తాను మద్యం సేవిస్తున్నానని తనతో చెప్పాడని డాక్టర్ భట్టాచార్జీ వెల్లడించాడు. ‘‘రాత్రి బాగా నిద్రపోవడానికి అతడు మద్యం సేవిస్తానని నాతో చెప్పాడు.’’ అని ఆయన అన్నారు. 

ఈ సంభాషణ జరిగిన కొద్దిసేపటికే శంకర్ మిశ్రా 70 ఏళ్ల వృద్ధురాలి వద్దకు వెళ్లి జిప్ తీసి, మూత్ర విసర్జన చేశాడు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తరువాత ఎయిర్ ఇండియా మిశ్రాపై ఎలాంటి చర్య తీసుకోకుండా విడిచిపెట్టింది. ఒక రోజు తర్వాత ఆ మహిళ ఎయిరిండియా గ్రూప్‌ ఛైర్మన్‌కు ఈ దారుణ ఘటన గురించి లేఖ రాసింది. ఇది సంచలనం రేకెత్తించింది. దీంతో ఎయిర్ ఇండియా జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఇరువర్గాలు పరిష్కరించుకున్నాయి అని భావించి పోలీసులను సంప్రదించలేదని ఎయిర్ ఇండియా పేర్కొంది.

ఢిల్లీపై చలి పంజా.. పొగమంచు ఎఫెక్ట్‌తో పలు రైళ్లు, విమానాలు ఆలస్యం.. స్కూల్స్‌కు ఈనెల 15 వరకు సెలవులు..!

మిశ్రా ఈ హేయమైన చర్యకు పాల్పడిన ఆరు వారాల తర్వాత గత శుక్రవారం బెంగళూరులో అరెస్టయ్యాడు. కాగా.. తాను ఈ విషయంలో ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేశానని, కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా పోయిందని డాక్టర్ భట్టాచార్జీ తెలిపారు. తోటి ప్రయాణికుడికి అండగా నిలవాల్సిన నైతిక బాధ్యత తనపై ఉందని, అందుకే రెండు పేజీల ఫిర్యాదు రాసి ఎక్కడికీ వెళ్లలేదన్నారు.

ఈ విషయంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా కొంచెం ముందుగా ప్రతిస్పందించాల్సి ఉండాల్సిందని ఆయన అంగీకరించారు. ‘‘ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో మేము విఫలమయ్యాము’’ అని చంద్రశేఖరన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మిశ్రాను అరెస్టు చేసిన పోలీసులు పది రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Follow Us:
Download App:
  • android
  • ios