హర్యానా గవర్నర్ బండారి దత్తాత్రేయకు ఛండీఘడ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో అవమానం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనను రాష్ట్రపతి పక్కన కాకుండా కొంచెం దూరంలో కూర్చోబెట్టారు.
హర్యానా గవర్నర్ బండారి దత్తాత్రేయకు అవమానం జరిగింది. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సులో శనివారం జరిగిన వైమానిక దళం వైమానిక ప్రదర్శనలో ఆయన విషయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
ఈ ఎయిర్ షో సందర్భంగా హర్యానా గవర్నర్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పక్కన కూర్చోపెట్టలేదని హర్యానా ప్రభుత్వం తన ఫిర్యాదులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హర్యానా ప్రభుత్వం పట్ల తరచూ ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ లో చర్చ జరగుతోంది.
వైమానిక ప్రదర్శన సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పక్కన పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ కూర్చున్నారు. రాష్ట్రపతికి మరో పక్కన ఎయిర్ చీఫ్ మార్షల్ కు, ఆయన భార్యకు సీటు కేటాయించారు. తరువాతి సీట్ లో బండారి దత్తాత్రేయ కూర్చున్నారు.
కడియాల కోసం దారుణం.. 108యేళ్ల వృద్ధురాలి కాళ్లు కోసేసిన నిందితులు..
వాస్తవానికి ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి పక్కన ఉపరాష్ట్రపతి, ప్రధాని లేకపోతే గవర్నర్‌ను కూర్చోబెట్టే సంప్రదాయం ఉంది. అయితే తాజా వివాదంలో చండీగఢ్ పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పక్కనే ఇరు రాష్ట్రాల గవర్నర్లు కూర్చోబెట్టాలి. కానీ చండీగఢ్‌లో జరిగిన ఎయిర్ షో సందర్భంగా హర్యానా గవర్నర్‌కు సంబంధించి ఈ ప్రోటోకాల్‌ను పాటించలేదు.
అతి సాధారణ కుటుంబం నుంచి దేశంలో కీలక నాయకునిగా.. ములాయం సింగ్ ఫ్యామిలీ, రాజకీయ ప్రస్తానం ఇదే..
ఈ వివాదం హర్యానా రాజ్ భవన్ అధికారుల వల్లే చోటు చేసుకుందని ఎయిర్ షో ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఎవరు ఒక్కడ కూర్చోవాలనే వివరాలను ముందుగానే రెండు రాష్ట్రాల రాజ్ భవన్ అధికారులకు తెలియజేశామని, కానీ కార్యక్రమం మొదలు అయ్యాక వాటిని పరిశీలించేందుకు ఆఫీసర్లు ఎవరూ అక్కడికి చేరుకోలేదని పేర్కొన్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ), పోలీసు కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్, రక్షణ సేవల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతికి విమానాశ్రయంలోగవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు.
