త్రిపుర: అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై ఏడుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఈశాన్య రాష్ట్రమయిన త్రిపురలో చోటుచేసుకుంది. తెలిసీ తెలియని వయసులో ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరిని హాస్పిటల్ కు తరలించిన పోలీసులు మిగతా నిందతులను జువైనల్ హోంకు తరలించారు. 

ఈ అఘాయిత్యం గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ త్రిపురకు చెందిన ఓ ఎనిమిదేళ్ళ బాలికను దాగుడుమూతలు ఆడుకుందామని చెప్పి నిందితులు ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా చిన్నారిపై ఏడుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. 

read more  గాఢ నిద్రలో 45 మంది ప్రయాణికులు: బస్సులో యువతిపై రేప్

తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక తన తండ్రికి తెలియజేయడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు మైనర్లలో ఆరుగురిని అరెస్ట్ చేశాడు. మరో నిందితుడు పరారీలో వున్నాడు. అయితే అరెస్ట్ చేసిన నిందితుల్లో ఇద్దరు మైనర్లకు కరోనా  పాజిటివ్ గా తేలడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు మిగతావారిని జువైనల్ హోంకు తరలించారు.

బాధిత బాలికను వైద్యం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. బాలిక ప్రస్తుతం మూడవ తరగతి చదువుతోంది. ఈ చిన్నారిపై సభ్యసమాజం తలదించుకునేలా మైనర్లు అత్యాచారానికి పాల్పడటం పట్ల గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరుతున్నారు.