Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస.. నేరాన్ని అంగీకరించిన నిందితులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింసకు సంబంధించిన కేసుల్లో ఆ దేశ పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు కనీసం 683 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఏడుగురు వ్యక్తులు హింసను ప్రేరేపించిన నేరాన్ని అంగీకరించారు. 
 

seven people admits inciting violence against hindus in bangladesh
Author
Dhaka, First Published Oct 25, 2021, 7:13 PM IST

న్యూఢిల్లీ: Bangladeshలో హిందువులపై హింస చెలరేగిన సంగతి తెలిసిందే. Hindusపై దాడులు జరిగాయి. కనీసం 70 హిందువుల ఇళ్లపై దాడి జరిగింది. ఈ ఘటన బంగ్లాదేశ్ సహా Indiaలోనూ కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలను ప్రేరేపించేలా ఫేస్‌బుక్ పోస్టు చేసినట్టు.. లౌడ్‌స్పీకర్‌లలో రెచ్చగొట్టేలా మాట్లాడినట్టు ఇద్దరు నిందితులు కోర్టు ముందు ఒప్పుకున్నారు. 

షైకత్ మండల్, రబియుల్ ఇస్లాం అనే ఇద్దరు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారు. రంగ్‌పూర్‌లో సీనియర్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ డెల్వర్ హొస్సెయిన్ ముందు షైకత్ మండల్, రబియుల్ ఇస్లాంలు తమ నేరాన్ని అంగీకరించారని ఓ కోర్టు అధికారి వెల్లడించారు.

రంగ్‌పూర్ సబ్ డిస్ట్రిక్ట్ పిర్‌గంజ్‌లోని కాలేజీలో మండల్ ఫిలాసఫీ స్టూడెంట్. ఈ కేసులో అరెస్టు కాగానే అధికారంలోని అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ ఛాత్రా లీగ్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి బహిష్కరించింది. రంగ్‌పూర్‌లో దుర్గా పూజా వేడుకల సమయంలో అక్టోబర్ 17న హింసకు తాను చేసిన ఫేస్‌బుక్ పోస్టు కూడా కారణమని మండల్ కోర్టుకు తెలియజేశారు. మండల్ తన ఫాలోవర్లను పెంచుకోవడానికి అసభ్యకరమైన కంటెంట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్టు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.

Also Read:బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. 29 హిందువుల ఇళ్లకు నిప్పు

కాగా, మండల్‌తో నేరంలో భాగస్వామ్యం పంచుకున్న 36ఏళ్ల రబియుల్ ఇస్లాం మత గురువు. అల్లర్లు, దోపిడీలో ఆయన నిందితుడిగా ఉన్నాడు. దేశంలోని హిందూ మైనార్టీలపై దాడులను ప్రోత్సహించేలా లౌడ్‌స్పీకర్‌లో తాను విద్వేష ప్రకటనలు చేసినట్టు ఇస్లాం మెజిస్ట్రేట్ ముందు తెలిపారు.

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజా వేడుకలు జరుగుతుండగా కొందరు ఉన్మాదులు హిందు మైనార్టీలపై దాడులకు తెగబడ్డారు. వారి ఇళ్లపైనా దాడులు జరిపారు. వీటిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా మైనార్టీలు ఆందోళనలు చేశారు. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ దాడులను ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ దాడులకు పాల్పడ్డ వారిని కచ్చితంగా పట్టుకుని తీరుతామని హామీనిచ్చారు. సోషల్ మీడియా పోస్టులను ప్రజలు గుడ్డిగా నమ్మవద్దని, వాటి నిజానిజాలను నిర్దారణ చేసుకున్న తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలని సూచించారు. 

ఈ ఘటనల్లో పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపారు. ఇప్పటి వరకు కనీసం 683 మందిని అరెస్టు చేశారు. ఘాజీపూర్‌లో జరిపిన రైడ్‌లో మండల్, రబియుల్ ఇస్లాంలను పోలీసులు అరెస్టు చేశారు. మండల్, రబియుల్‌తోపాటు మరో ఐదుగురూ తమ నేరాలను అంగీకరించినట్టు తెలిసింది.

దుర్గా పూజా మండపంలో ఖురాన్ కాపీని పెట్టడంతో కొమిల్లా జిల్లాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనలోనూ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఖురాన్ కాపీనీ ఆలయంలో ఉంచిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. 35ఏళ్ల ఇక్బాల్ హొస్సెయిన్‌ను అరెస్టు చేశారు. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫయేజ్ అహ్మద్‌నూ అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios