Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. 29 హిందువుల ఇళ్లకు నిప్పు

బంగ్లాదేశ్‌లో మతోన్మాద దాడులు ఆగడం లేదు. దుర్గా పూజా వేడుకలపై దాడులతో మొదలైన ఈ హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. దేశ రాజధాని ఢాకా నుంచి 255 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి మరో భీకర దాడి జరిగింది. ఇందులో 29 హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టినట్టు తెలిసింది.
 

around 29 hindu community homes set ablaze in bangladesh
Author
Dhaka, First Published Oct 18, 2021, 6:03 PM IST

న్యూఢిల్లీ: Bangladeshలో మతోన్మాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. Hindu Temples, హిందువుల నివాసాలను లక్ష్యాలుగా చేసుకుని దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారం క్రితం Durga పూజా వేడుకలపై కొందరు మతోన్మాదులు దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కుమిల్లాలో జరిగిన ఈ ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షిస్తామని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా హామీనిచ్చారు. కానీ, ఈ దాడులు మాత్రం ఆగడం లేదు. Muslim మెజారిటీగల బంగ్లాదేశ్‌లో 29 హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టినట్టు స్థానిక కథనాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు తెలిసింది.

హిందు మతానికి చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో మతాన్ని దూషిస్తూ ఓ పోస్టు పెట్టాడని తెలిసింది. ఆ పోస్టుపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు సమాచారం. ఈ పోస్టుతో ఉద్రిక్తతలు నెలకొన్నాయని తెలుసుకున్న పోలీసులు ఆయన నివసిస్తున్న కాలనీకి పోలీసులు చేరినట్టు ఓ అధికారి వెల్లడించారు. ఆ పోస్టు చేసిన వ్యక్తి నివాసం దగ్గర పోలీసులు కాపలాగా ఉన్నప్పటికీ దుండగులు ఊరుకోలేదని తెలిసింది. ఆ ఇల్లు వదిలి దానికి సమీపంలోని మిగతా ఇళ్లకు నిప్పు పెట్టారు.

రాత్రి 8.45 గంటల ప్రాంతంలో ఫైర్ సర్వీస్‌కు తొలి కాల్ వెళ్లినట్టు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు తెల్లవారు జామున 4.10 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చినట్టు ఓ రిపోర్ట్ తెలిపింది. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టంపై వివరాలు అందలేదు.

Also Read: బంగ్లాదేశ్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి.. దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు మైనారిటీల పిలుపు

చిట్టాగాంగ్ డివిజన్‌లోని కుమిల్లా జిల్లాలో దుర్గా పూజా వేడుకలపై దాడులు కలకలం రేపాయి. ఆ దాడులను నిరసిస్తూ మైనార్టీ ప్రజలు నిరసనలు, ధర్నాలు చేశారు. కానీ, దాడులు ఆగలేవు. ఆలయాలు, హిందూ ఇళ్లు, వారికి చెందిన వ్యాపారసముదాయాలపై దాడులు చేశారు. దోపిడీలూ చేశారు. కుమిల్లా, చాంద్‌పుర్, చత్తోగ్రామ్, కాక్స్ బజార్, బందర్బాన్, మౌల్వీ బజార్, గాజీపూర్, చపాయ్ నవాబ్ గంజ్, ఫెని, ఇతర జిల్లాల్లోనూ హిందువుల లక్షిత దాడులు జరిగాయి.  చాంద్‌పుర్, నోవాఖాలి ఏరియాలో జరిగిన దాడుల్లో హిందు మతానికి చెందిన నలుగురు మృతి చెందినట్టు బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios