దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. రైల్వే స్టేషన్‌లో నిర్మానుష్యంగా ఉండే బ్రిడ్జిపైకి ఎవరైనా మహిళలు వస్తే వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి.

Also Read:కరోనా వైరస్ పేరు చెప్పింది.. రేప్ చేయడానికి వచ్చినోడు పరుగో పరుగో

దీంతో పోకిరిలపై నిఘా పెట్టిన పోలీసులు.. మహిళలను వేధిస్తున్న ఓ యువకుడిని పట్టుకున్నారు. ఓ చోరీ కేసులో పట్టుబడ్డ నిందితుడిని మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు.

ఆ తర్వాత పీఎస్‌లో తమదైన స్టైల్లో విచారించగా అమ్మాయిలను టీజ్ చేసే సంగతిని చెప్పడంతో ఖాకీలు సైతం నివ్వెరపోయారు. కాగా ఇతని చేతుల్లో లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఎవరు ఇంకా ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు.

Also Read:తల్లిని చంపి ప్రియుడితో అండమాన్ కు లేచిపోయిన లేడీ టెక్కీ

దొంగతనం కేసులో నిందితుడికి బెయిల్ లభించిన్లు చెప్పారు. మరోవైపు జనవరి 25న సదరు నిందితుడు నగరంలోని మతుంగ రైల్వేస్టేషన్‌లో మాటు వేశాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ మహిళా ప్రయాణీకురాలిని అసభ్యంగా తాకుతూ బలవంతంగా ముద్దు పెట్టుకుని పెట్టుకుని పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.