Asianet News TeluguAsianet News Telugu

Draupadi Murmu : స్వ‌యంగా ఆల‌య ప్రాంగణాన్ని ఊడ్చి, పూజ‌లు చేసిన ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఒడిశాలోని పలు ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆలయంలో ఆమె స్వయంగా గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. 

Self sweeping the temple floor. Worshiped NDA state candidate Draupadi Murmu
Author
New Delhi, First Published Jun 22, 2022, 1:09 PM IST

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము బుధ‌వారం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా రాయరంగ్‌పూర్‌లోని అనేక దేవాలయాలను సందర్శించారు. జగన్నాథ‌, హనుమాన్, శివాలయాలను ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ క్రమంలో పూర్ణాంధేశ్వర్ శివాలయంలో ఆమె పూజ‌లు నిర్వ‌హించారు. దీనికి ముందు ద్రౌప‌తి ముర్ము ఆల‌య ప‌రిస‌రాల్లోని నేల‌ను స్వ‌యంగా చీపురుప‌ట్టి ఊడ్చారు. అనంతరం ప్రజాపితా బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. 

మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర శివసేన సంక్షోభం: అసెంబ్లీ రద్దు దిశగా ఉద్దవ్ ఠాక్రే యోచన?

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్మును ఎన్డీఏ మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌క‌టించింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఆమెకు సాయుధ CRPF సిబ్బందితో కేంద్రం రౌండ్-ది క్లాక్ Z+ భద్రతను క‌ల్పించింది. ఈరోజు ఉద‌యం సీఆర్‌పీఎఫ్ కమాండోలు ముర్ము భద్రత బాధ్య‌త‌ను స్వీక‌రించార‌ని సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశాకు చెందిన గిరిజన నాయ‌కురాలు ముర్ము ఉంటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ నేతలతో కూడిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ద్రౌప‌ది ముర్ము అపారమైన రాజకీయ అనుభవం క‌లిగిన నాయ‌కురాలు. ఆమె సుదీర్ఘకాలం ఎమ్మెల్యే, మంత్రిగా ప‌ని చేశారు. 2007లో శాసనసభ్యురాలిగా నీలకంఠ అవార్డును అందుకున్నారు. ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా పూర్తి కాలం పనిచేశారు. 1958లో జన్మించిన ఆమె భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో బీఏ పూర్తి చేశారు. ఆమె సంతాల్ గిరిజన కమ్యూనిటీకి చెందిన మ‌హిళ‌. ద్రౌప‌ది ముర్ము ప్రెసిడెంట్ రేసులో గెలిస్తే భారతదేశపు మొదటి గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతారు. 

ఏ క్షణంలోనైనా మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే చాన్స్!.. సంజయ్ రౌత్ సంచలన ట్వీట్..

1997లో రాయరంగ్‌పూర్ నగర్ పంచాయతీలో కౌన్సిలర్‌గా ముర్ము తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె రాయ్‌రంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2013లో పార్టీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు స్థాయికి ఎదిగారు. ఆమె 2000, 2004 సంవత్సరాల్లో ఒడిశాలోని రాయంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.  ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో ద్రౌపది ముర్ము 2000-2002 మధ్య వాణిజ్యం, రవాణాశాఖ బాధ్యతల‌ను చేప‌ట్టింది. దీంతో పాటుగా.. మత్స్య మరియు జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు.

ప్ర‌ధాని మోడీ హయాంలో దేశంలో అన్నీ సాధ్యమే - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

ముర్ము.. శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయిన ముర్ము జీవితం ఎన్నో విషాదాలతో నిండిపోయింది. ఆమె కుమార్తె ఇతిశ్రీని.. గణేష్ హెంబ్రామ్‌ను వివాహం చేసుకున్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివ‌రి తేదీ జూన్ 29 కాగా, జూలై 18న పోలింగ్ జరుగుతుంది. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios