Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌ధాని మోడీ హయాంలో దేశంలో అన్నీ సాధ్యమే - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 

Everything is possible in the country under Prime Minister Modi - Rajasthan CM Ashok Gehlot
Author
New Delhi, First Published Jun 22, 2022, 11:46 AM IST

రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని రాజ‌స్థాన్ సీఎం అశోక్ అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల‌న‌లో అన్నీ సాధ్య‌మ‌వుతున్నాయ‌ని ఆరోపించారు. మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ‘‘ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఆదాయపు పన్ను విభాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎప్పుడైనా  న్యాయం జరగనప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఒత్తిడిలో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన ఆట‌గా మారుతోంది ’’ అని ఆయ‌న అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో నేరం, అన్యాయం, దౌర్జన్యాలు, అణచివేత అన్నీ సాధ్యమేనని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న సత్యాగ్ర‌హం సంద‌ర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ‘‘బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. వీరు ఫాసిస్ట్ వ్యక్తులు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ప్రజాస్వామ్య ముసుగు వేసుకుని రాజకీయాలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు. రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలకు అడ్వాన్స్‌గా రూ.10 కోట్లు పంపిణీ చేశారన్నారు.

Presidential Election: బీజేపీ ట్రంప్‌ కార్డుగా ద్రౌపది ముర్ము..! ఆ పార్టీలు ఇరుకునపడినట్టేనా..?

రాజస్థాన్‌లో కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని మీడియా అడిగిన ప్రశ్నలకు అశోక్ గెహ్లాట్ స‌మాధానం ఇచ్చారు. ప్రతీ రాష్ట్రానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని ఆయ‌న చెప్పారు. వారు అక్క‌డ కొత్త ప్రయోగాలు చేస్తున్నారని, కొన్ని చోట్ల విజయవంతమయ్యారని కూడా తెలిపారు. ‘‘ మధ్యప్రదేశ్‌లో ఈ విష‌యంలో వారు విజయవంతమయ్యారు. మేము కొన్ని సమయానుకూల చర్యలు తీసుకున్నాం. వారి ప్రయత్నాలను అడ్డుకోవడంలో మేము విజ‌యం సాధించాం. ’’ అని ఆయన చెప్పారు. బీజేపీ తన చివరి ప్రయత్నం విఫలమైన నాటి నుంచి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయ‌న ఆరోపించారు. 

Coronavirus: క‌రోనాతో 5,24,903 మంది మృతి.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు

కాగా రాజ‌స్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు గ‌తేడాది ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప‌లువురు పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకున్నారు. గురుగ్రామ్‌లోని ఓ రిసార్ట్‌లో వారంద‌రిని ఉంచి ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డంలో విఫలం అయ్యార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. గెహ్లాట్ ఈ విష‌యంలో ఒక నెలపాటు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న‌ప్ప‌టికీ చివ‌రికి ప్ర‌భుత్వాన్ని కాపాడుకోగలిగారు.

Prophet row : హిందూ దేవుళ్ల‌పై పరుష పదజాలం వాడే వారినే నేను ప్ర‌శ్నించా - న‌వీన్ జిందాల్

ఇదిలా ఉండ‌గా శివసేన నేతృత్వంలో ఉన్న మ‌హారాష్ట్ర ఎంవీఏ ప్ర‌భుత్వం కూడా కూలిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. శివ‌సేన రెబల్‌ ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్‌ షిండే, దాదాపు 34 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే పై తిరుగుబాటు ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో క్రాస్ ఓటింగ్ జ‌రిగిన త‌రువాతి రోజే ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. వారంతా నిన్న రాత్రి వ‌ర‌కు గుజ‌రాత్ రాష్ట్రంలోని సూర‌త్ లో ఉన్న ఓ హోట‌ల్ లో ఉన్నారు. అయితే బుధ‌వారం తెల్ల‌వారుజామున అక్క‌డ నుంచి బ‌య‌లుదేరి అస్సాం రాజధాని గౌహ‌తికి విమానంలో చేరుకున్నారు. వీరంతా పార్టీ మారినా లేదా రాజీనామా చేసిననా మహారాష్ట్ర అసెంబ్లీలో ఠాక్రే ప్రభుత్వ బలం తగ్గి మెజార్టీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios