న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభం దేశానికి ఓ పాఠం నేర్పిందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ వైరస్ ద్వారా ఏర్పడిన సంక్షోభం కారణంగా స్వయం సమృద్ధిగా ఉండాలని, రోజూవారీ కార్యక్రమాల్లో  దేనికోసం కూడ ఇతరులపై ఆధారపడకూడదని నేర్పించిందన్నారు. 

పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు గ్రామపంచాయితీ సర్పంచ్‌లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ ను ప్రధాని ఆవిష్కరించారు. 

కరోనా వైరస్ మన మార్గంలో అనేక సవాళ్లను పంపిందని  ప్రదాని అభిప్రాయపడ్డారు. మన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందిగా ఆయన చెప్పారు.మన మనుగడపై మనపై మాత్రమే ఆధారపడాలని మోడీ సూచించారు. కరోనా కొత్త పాఠాలను నేర్పుతోందని ఆయన చెప్పారు. 

కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు ఎదురౌతున్నాయన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉంది కరోనాను తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆహార, సదుపాయాలు అందించాలని ఆయన గ్రామ పంచాయితీ సభ్యులను కోరారు. కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

also read:కరోనా ఎఫెక్ట్: కేరళలో నాలుగు నెలల చిన్నారి మృతి

ఈ వారం ప్రారంభంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు రాసిన లేఖలో గ్రామపంచాయితీ సభ్యుల పాత్రను ఆయన ప్రశంసించారు. వారిని యోధులుగా అభివర్ణించారు. ఆరోగ్య సంక్షోభ సమయంలో దేశంలోని పంచాయితీ సభ్యులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. 

కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సర్పంచ్ లకు సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు.విద్యుత్, రోడ్లు, పారిశుద్యంపై  జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన గ్రామాల ప్రజా ప్రతినిధులకు సూచించారు.