తిరువనంతపురం: కరోనా వైరస్ సోకి నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకొంది. కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలోని మంజేరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఈ గ్రామానికి చెందిన మంజేరికి చెందిన  నాలుగు నెలల చిన్నారికి జ్వరం, శ్వాసలో ఇబ్బందులు ఏర్పడడంతో తల్లిదండ్రులు ఈ నెల 21న కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం ఈ నెల 23న ఆ చిన్నారికి కరోనా అని తేల్చారు వైద్యులు.

also read:ఇండియాపై కరోనా దెబ్బ: మొత్తం కేసులు 23,077కి చేరిక, 718 మంది మృతి

అయితే కరోనా పాజిటివ్ అని తేలడంతో వైద్యలు ఆ చిన్నారికి చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆ చిన్నారి శుక్రవారం నాడు ఉదయం మృతి చెందింది. ఈ చిన్నారికి గుండె సంబంధిత సమస్యలు కూడ ఉన్నాయని వైద్యులు చెప్పారు. 

మలప్పురం జిల్లాలో ఇప్పటివరకు 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 447కి చేరుకొన్నాయి. వీటిలో యాక్టివ్ కేసులు 129కి చేరాయి.  సుమారు 23 వేల మంది క్వారంటైన్ లో ఉన్నారు.