కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ నివాసంలోకి కారు దూసుకెళ్లడం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గత నెలలో జరిగింది. ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు ఆకస్మాత్తుగా వచ్చింది.

ఆ కారులో ఓ అమ్మాయితో పాటు ఐదుగురు ఉన్నారు. భద్రతా సిబ్బంది తేరుకునే లోపే గార్డెన్‌లో ఉన్న ప్రియాంక దగ్గరకు ఆ ఐదుగురు పరిగెత్తికెళ్లారు. దీంతో స్పందించిన భద్రతా సిబ్బంది వారిని చుట్టుముట్టి విచారించారు. ప్రియాంకతో సెల్ఫీ దిగేందుకే వాళ్లు ఇలా ఎలాంటి అనుమతి లేకుండా లోపలికి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:సోనియా కుటుంబం కోసం పదేళ్ల నాటి కార్లు: బుల్లెట్ ప్రూఫ్ కోసం నిరీక్షణ

కాగా... కేంద్రప్రభుత్వం ఇటీవలే సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రియాంక ఇంట్లోకి కారు దూసుకురావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కపడుతున్నారు. భద్రతా వైఫల్యం కారణంగానే ఇలా జరిగిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబసభ్యులకు కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి కేటాయించిన వాహనాలపై విమర్శలు వస్తున్నాయి.

సోనియా కుటుంబానికి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కింద పదేళ్ల నాటి టాటా సఫారీ ఎస్‌యూవీలు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇవి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావు.

ఎస్పీజీ కేటగిరీ కింద గతంలో సోనియా, ప్రియాంకు రేంజ్ రోవర్, రాహుల్ గాంధీకి ఫార్చునర్ కార్లు ఉండేవి. దీంతో పాటు వీరి పర్యటన జరిగే ప్రాంతాలకు ముందుగానే చేరుకుని ఆ ప్రదేశాన్ని ఎస్పీజీ కమాండోలు తనిఖీ చేసేవారు.

అయితే జడ్ ప్లస్ కేటగిరీ కింద సోనియా కుటుంబసభ్యులకు 100 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు రక్షణగా నిలవనున్నారు. కాగా.. వీరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించాలని సీఆర్‌పీఎఫ్ అధికారులు ఇప్పటికే ఎస్‌పీజీని కోరినప్పటికీ ఇంకా వారి నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. 

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సహా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు ఎస్పీజీ భద్రతను తొలగించింది. దీనికి బదులుగా జడ్‌ప్లస్ క్యాటగిరీ భద్రతను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.

Also Read:సోనియా కుటుంబానికి మోడీ షాక్: ఎస్పీజీ భద్రత తొలగింపు

దీనికి సంబంధించి ఎస్పీజీ చట్టాన్ని సవరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే ఎస్పీజీ సెక్యూరిటీ కలిగివున్న వ్యక్తిగా నిలవనున్నారు.