Asianet News TeluguAsianet News Telugu

పీఎఫ్ఐపై కొనసాగుతున్న ఎన్ఐఏ, ఈడీ సోదాలు: ఎనిమిది రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు


దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థలు, కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ, ఈడీ అధికారులు మంగళవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల క్రితం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు నిర్వహించిన విషయం తెలిసిందే. 

 Second  round of mega NIA raids on PFI underway in 8 states
Author
First Published Sep 27, 2022, 9:52 AM IST


న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థలు, కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల క్రితం దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించి సుమారు 106 మందిని అరెస్ట్ చేశారు. ఈ సోదాలకు కొనసాగింపుగా మంగళవారం నాడు దేశంలోని  ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు.  మరో వైపు దసరా ఉత్సవాల్లో విధ్వంసాలకు పీఎఫ్ఐ కుట్ర చేసిందని ఎన్ఏఐ గుర్తించింది. 

పీఎఫ్ఐ  తో సంబంధం ఉన్న వారికి వచ్చిన నిధులపై ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.  బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు పీఎఫ్ఐ  కుట్ర చేసిందని ఎన్ఐఏ ఆరోపించింది.  ఈ దిశగా కూడా ఎన్ఐఏ అధికారులు   దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల నుండి పీఎఫ్ఐ కార్యకర్తల బ్యాంకు ఖాతాలకు రూ. 120 కోట్లు నిధులు వచ్చాయి. ఆరు మాసాల కాలంలోనే ఈ నిధులు వచ్చినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.  పీఎఫ్ఐ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలు, పీఎఫ్ఐలో కీలకంగా వ్యవహరిస్తున్న సభ్యుల ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.  ఈ నిధులను ఎవరు పంపారు, ఎక్కడి నుండి ఈ నిధులు వచ్చాయనే  విషయమై ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల నుండి నిధులు దేశంలోని ఏయే ప్రాంతాలకు వచ్చాయనే విషయాన్ని కూడ ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నిధులతో పీఎఫ్ఐ కార్యకర్తలు ఏం చేయనున్నారనే విషయమై కూడ ఎన్ఐఏ సోదాలు  చేస్తున్నారు.

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ  కుట్ర


దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ కుట్ర పన్నిందని నిఘా వర్గాలు గుర్తించాయి. మహరాష్ట్రలోని ఎటీఎస్ అధికకారులు పీఎఫ్ఐ కార్యకర్తలను విచారించిన సమయంలో కీలక విషయాలు వెలుగు  చూశాయి.బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను లక్ష్యంగా దాడులు చేయాలని పీఎఫ్ఐ కుట్ర చేసిందని ఏటీఎస్ గుర్తించింది. 

also read:పీఎఫ్‌ఐని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకుల నిరసన

నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు బీజేపీ,ఆర్ఎస్ఎస్ కీలక నేతలు కూడా పీఎఫ్ఐ లక్ష్యంగా చేసుకుందని  ఏటీఎస్ సోమవారం నాడు తెలిపింది. దసరా ఉత్సవాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల కదలికలను గుర్తించేందుకు పీఎఫ్ఐ ప్లాన్ చేసిందని ఏటీఎస్ తెలిపింది. ఈ విషయమై సీఎన్ఎన్ న్యూస్ 18 ఇంటలిజెన్స్ నివేదికను ప్రచురించింది.  శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు  పీఎఫ్ఐ కుట్ర పన్నిందని ఎన్ఐఏ అధికారులు ఆరోపించారు. అంతేకాదు ఎన్ఐఏ, ఈడీ అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని కూడ పీఎఫ్ఐ ప్లాన్ చేసిందని ఈ నివేదిక తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios