నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Saturday 24th September Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 
9:32 PM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ వున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లే రహదారులపై భారీ వాహనాలను అనుమతించేది లేదని తెలిపారు. 

8:45 PM IST

కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడుతూ, పాడుతూ ఆనందోత్సహాల మధ్య జరిగే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని ఆయన అన్నారు. బతుకమ్మను రాష్ట్రపండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. 

7:48 PM IST

రష్యాలో కలుస్తారా .. లేదా..?

రష్యా ఆధీనంలో వున్న ఉక్రెయిన్ నగరాలను స్వాధీనం చేసుకోవడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ నెల 27 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అయితే ఈ ప్రక్రియను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండిస్తోంది. 2014లో క్రిమియాను కలుపుకున్న మాదిరే రష్యా ఇక్కడా వ్యవహరిస్తోందని ఆరోపింస్తోంది. 

7:11 PM IST

హెచ్‌సీఏపై వివేక్ సంచలన వ్యాఖ్యలు

హెచ్‌సీఏలో పరిస్ధితులపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఈ పరిస్ధితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. కుమార్తె కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వివేక్ వ్యాఖ్యానించారు. 

6:10 PM IST

హైదరాబాద్‌కి భారత్- ఆసీస్ ఆటగాళ్లు

రేపు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీ20 మ్యాచ్ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లకు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని హోటల్‌కి తరలించారు.

5:35 PM IST

గుడివాడలో ఉద్రిక్తత

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అమరావతి రైతులు, వైసీపీ నేతలు పోటాపోటీ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల పాదయాత్ర కాసేపటి క్రితం గుడివాడ శరత్ టాకీస్ వరకు చేరుకుంది. అదే సమయంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు రైతులు. 

3:47 PM IST

తస్మాత్ జాగ్రత్త... రష్యా గబ్బిలాల్లో కరోనా కంటే భయంకర వైరస్

ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుండి బయటపడుతున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది. కరోనా కంటే భయంకరమైన 'ఖోస్తో 2' వైరస్ ను రష్యాలోని గబ్బిలాల్లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది ఇంకా మనుషులకు వ్యాపించకున్నా చాలా ప్రమాదకరమైనదిగా శాస్త్రవేత్తలు తెలిపారు.  

2:57 PM IST

అక్టోబర్ ఫస్ట్ నుండి భారత్ లో 5జి సేవలు... ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారత్ లో అక్టోబర్ 1వ తేదీన 5జి సేవలు ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో పాల్గొన్న ప్రధాని 5జి సేవల ప్రారంభంగురించి కీలక ప్రకటన చేసారు. 

1:51 PM IST

హైదరాబాద్ టీ20 కి భారీ పోలీస్ భద్రత... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరిస్ లో మూడో మ్యాచ్ రేపు (ఆదివారం) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఇప్పటికే టికెట్ల అమ్మకం విషయంలో గందరగోళం నెలకొని తొక్కిసలాటలో పలువురు అభిమానులు గాయపడ్డ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని... ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ఉప్పల్ స్టేడియం వద్ద, ఆటగాళ్ళు ప్రయాణించే దారుల్లో భారీ భద్రత ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు. 

12:34 PM IST

చిన్నారులపై లైంగిక వేధింపులు... తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ సోదాలు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 56 చోట్ల సిబిఐ దాడులు చేపడుతోంది. విదేశాల నుండి అందిన సమాచారం మేరకు ఆన్ లైన్ లో చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యవహారంపై ఆపరేషన్ మెగా చక్ర పేరిట సిబిఐ సోదాలు చేపట్టింది.  

11:39 AM IST

తెలంగాణవ్యాప్తంగా హాస్పిటల్స్ పై అధకారుల దాడులు

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్స్ లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు దాడులు చేపడుతున్నారు.  ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో నింబంధనలు పాటించని హాస్పిటల్స్ కు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. 
 
10:52 AM IST

ప్రధాని మోదీ టార్గెట్ గా పిఎఫ్ఐ కుట్రలు...

 ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా పిఎఫ్ఐ కుట్రలు చేస్తోందని... జూలై 12న బిహార్ రాష్ట్రంలోని పాట్నా సభలో విధ్వంసానికి పథకరచన చేసినట్లు ఈడీ విచారణతో తేలినట్లు సమాచారం.  

Read More బీహార్‌లో ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర.. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!
 
10:46 AM IST

విదేశాల నుండి వందలకోట్లు... భారత్ లో విధ్వంసానికి కుట్ర: పిఎఫ్ఐ పై ఈడి సంచలనాలు

పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ఇటీవల ఆ సంస్థ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల నుండి ఈ సంస్థకు వందల కోట్ల నిధులు సమకూర్చుకున్నట్లు ఈడీ గుర్తించింద. 

9:50 AM IST

ఇబ్రహీంపట్నం కు.ని ఘటనపై కేసీఆర్ సర్కార్ సీరియస్... డాక్టర్ పై క్రిమినల్ కేసు

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రంగారెడ్డి డిఎంహెచ్వో స్వరాజ్య లక్ష్మి, డిసిహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మి లపై బదిలీ వేటు వేయడంతో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసారు. 

read more ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ స‌ర్కార్ సీరియస్

9:42 AM IST

తెలంగాణ కాంగ్రెస్ లో ఈడీ ప్రకంపనలు... మాజీ మంత్రులకు నోటీసులు?

తెలంగాణ కాంగ్రెస్ లో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీతో పాటు మరికొందరు సీనియర్లను ఈడి విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డితో పాటు మరో మాజీ మహిళా మంత్రి ఈడీ నోటిసులు జారీచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల షబ్బీర్ అలీ జైలుకెళ్లే అవకాశాలున్నాయని... పార్టీ పరువు పోకముందే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఏఐసిసి కి లేఖ రాసిన విషయం తెలిసిందే. 

9:32 PM IST:

రేపు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ వున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లే రహదారులపై భారీ వాహనాలను అనుమతించేది లేదని తెలిపారు. 

8:45 PM IST:

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడుతూ, పాడుతూ ఆనందోత్సహాల మధ్య జరిగే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని ఆయన అన్నారు. బతుకమ్మను రాష్ట్రపండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. 

7:48 PM IST:

రష్యా ఆధీనంలో వున్న ఉక్రెయిన్ నగరాలను స్వాధీనం చేసుకోవడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ నెల 27 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అయితే ఈ ప్రక్రియను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండిస్తోంది. 2014లో క్రిమియాను కలుపుకున్న మాదిరే రష్యా ఇక్కడా వ్యవహరిస్తోందని ఆరోపింస్తోంది. 

7:11 PM IST:

హెచ్‌సీఏలో పరిస్ధితులపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఈ పరిస్ధితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. కుమార్తె కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వివేక్ వ్యాఖ్యానించారు. 

6:10 PM IST:

రేపు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీ20 మ్యాచ్ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లకు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని హోటల్‌కి తరలించారు.

5:35 PM IST:

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అమరావతి రైతులు, వైసీపీ నేతలు పోటాపోటీ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల పాదయాత్ర కాసేపటి క్రితం గుడివాడ శరత్ టాకీస్ వరకు చేరుకుంది. అదే సమయంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు రైతులు. 

3:47 PM IST:

ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుండి బయటపడుతున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది. కరోనా కంటే భయంకరమైన 'ఖోస్తో 2' వైరస్ ను రష్యాలోని గబ్బిలాల్లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది ఇంకా మనుషులకు వ్యాపించకున్నా చాలా ప్రమాదకరమైనదిగా శాస్త్రవేత్తలు తెలిపారు.  

2:57 PM IST:

భారత్ లో అక్టోబర్ 1వ తేదీన 5జి సేవలు ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో పాల్గొన్న ప్రధాని 5జి సేవల ప్రారంభంగురించి కీలక ప్రకటన చేసారు. 

1:51 PM IST:

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరిస్ లో మూడో మ్యాచ్ రేపు (ఆదివారం) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఇప్పటికే టికెట్ల అమ్మకం విషయంలో గందరగోళం నెలకొని తొక్కిసలాటలో పలువురు అభిమానులు గాయపడ్డ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని... ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ఉప్పల్ స్టేడియం వద్ద, ఆటగాళ్ళు ప్రయాణించే దారుల్లో భారీ భద్రత ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు. 

12:34 PM IST:

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 56 చోట్ల సిబిఐ దాడులు చేపడుతోంది. విదేశాల నుండి అందిన సమాచారం మేరకు ఆన్ లైన్ లో చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యవహారంపై ఆపరేషన్ మెగా చక్ర పేరిట సిబిఐ సోదాలు చేపట్టింది.  

11:39 AM IST:

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్స్ లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు దాడులు చేపడుతున్నారు.  ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో నింబంధనలు పాటించని హాస్పిటల్స్ కు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. 
 
10:53 AM IST:

 ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా పిఎఫ్ఐ కుట్రలు చేస్తోందని... జూలై 12న బిహార్ రాష్ట్రంలోని పాట్నా సభలో విధ్వంసానికి పథకరచన చేసినట్లు ఈడీ విచారణతో తేలినట్లు సమాచారం.  

Read More బీహార్‌లో ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర.. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!
 
10:46 AM IST:

పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ఇటీవల ఆ సంస్థ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల నుండి ఈ సంస్థకు వందల కోట్ల నిధులు సమకూర్చుకున్నట్లు ఈడీ గుర్తించింద. 

9:53 AM IST:

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రంగారెడ్డి డిఎంహెచ్వో స్వరాజ్య లక్ష్మి, డిసిహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మి లపై బదిలీ వేటు వేయడంతో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసారు. 

read more ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ స‌ర్కార్ సీరియస్

9:42 AM IST: