బెంగళూరు: శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన వైద్యులపై, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆమె గొడవకు దిగారు. పోలీసులపై, వైద్యులపై తనకు నమ్మకం లేదని ఆమె అన్నారు. అసలు తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

తాను రక్తపరీక్షలు చేయించుకోనని, తనకు అవసరం లేదని సంజన అన్నారు. తనను ఇరికించడానికి మార్చేస్తారోమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. రక్తపరీక్షలు చట్టపరంగా చేయాలి గానీ బలవంతంగా చేయకూడదని ఆమె అన్నారు. తనను ఇరికించడానికి మార్చేసే అవకాశాలున్నాయని ఆమె అన్నారు. తనను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. 

Also Read: డ్రగ్స్ కేసు: సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీ వివాహం గుట్టు రట్టు

డాక్టర్లు, పోలీసులు, మీడియా ప్రతినిధులు ఎవరు చెప్పినా కూడా తాను వినడానికి సిద్ధంగా లేదని అన్నారు. బలవంతంగా రక్తం సేకరించి పరీక్షలు చేసినా రక్తం తనదే అనే గ్యారంటీ ఏమిటని ఆమె అడిగారు. 

ఇదిలావుంటే, బెంగళూరు డ్రగ్స్ కేసులో మరొకరిని అరెస్టు చేశారు హర్యానాకు చెందిన ఆదిత్యా అగర్వాల్ ను అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసు శాండల్ వుడ్ లో దుమారం రేపుతోంది. సినీ తారలు రాగిణి ద్వివేదిని, సంజనను సీసీబీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. 

Also Read: డ్రగ్స్ కేసు... ఏడ్చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీ