డ్రగ్స్ కేసు: సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీ వివాహం గుట్టు రట్టు

First Published 11, Sep 2020, 8:39 AM

మరింత మంది తారలు కూడా డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనేవారని సీసీబీ విచారణలో తేలింది. సంజనాతో కారు నడుపుతూ గతంలో సెల్ఫీ తీసుకున్న వీడియో ఒక్కటి సీసీబీ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసు విచారణలో సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీకి సంబంధించిన కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సంజనకు వివాహమైందా, లేదా అని సీసీబీ పోలీసులు విచారించారు. తనకు పెళ్లి కాలేదని మంగళవారం అరెస్టు చేసినప్పుడు సంజన చెప్పింది. అయితే ఏడాది క్రితం ఆమె వివాహానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు ఆమెకు ఆ ఫొటోను చూపించారు. దాంతో ఆమె ఒక్కసారిగా కంగు తిన్నది. అజీజ్ పాషా అనే వైద్యుడిని ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. పోలీసులు సాక్ష్యాలు చూపించడంతో సంజన తనకు పెళ్లయిన విషయాన్ని అంగీకరించక తప్పలేదని అంటున్నారు.

శాండల్ వుడ్ లోని డ్రగ్స్ రాకెట్ కేసును సీసీబీ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన తారలు రాగిణి ద్వివేదిని, సంజనాను విడివిడిగా విచారిస్తున్నారు. ఈ విచారణలో వారు తమ సన్నిహితులు, మిగతా నిందితలకు సంబంధించిన సమాచారాన్ని వెళ్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ను డెబిట్, క్రెడిట్, బిట్ కాయిన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలు సేకరించారు. డార్క్ వెబ్ లో డ్రగ్స్ ముఠాల నుంచి, ఆఫ్రికన్ల నుంచి కొనుగోలు చేసేవారని తెలుస్తోంది.

మరింత మంది తారలు కూడా డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనేవారని సీసీబీ విచారణలో తేలింది. సంజనాతో కారు నడుపుతూ గతంలో సెల్ఫీ తీసుకున్న వీడియో ఒక్కటి సీసీబీ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో 13వ నిందితుడు నియాస్ అహమ్మద్ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు

డ్రగ్స్ కేసులో రాగిణి, సంజన మహిళా సాంత్వన కేంద్రంలో ఉంటున్నారు. వారికి ప్రత్యేక గదులు కేటాయించారు. ఐదు పడకలు గల గదిని ఇద్దరికి ఉమ్మడిగా ఇచ్చారు. అయితే తమకు వేర్వేరు గదులు కావాలని వారు పట్టుబట్టారు. తమ మధ్య ఉన్న విభేదాల కారణంగానే అలా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారికి వేర్వేరు గదులు కేటాయించారు.

రాగిణి, సంజనల మొబైల్ ఫోన్ల నుంచి వాట్సప్, అవుట్ గోయింగ్ కాల్ డేటాను సీసీబీ పోలీసులు సేకరిస్తున్నారు. దాదాపు 100 మందితో వారు ఫోన్లలో మాట్లాడినట్లు తేలింది. అరెస్టు చేస్తారని తెలియడంతో వారు తమ తమ మొబైళ్లలోని సమాచారాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. దాంతో వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాగిణి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. తల తిరుగుతున్నట్లు అనిపిస్తోందని, ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో రాగిణిని జనరల్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లి పరీక్షలు చేయించారు. ఆమెకు బీపీతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు తేలింది. రక్త పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పగా అందుకు రాగిణి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు తీసుకుని రక్త పరీక్షలు చేస్తున్నట్లు సీఐ అంజుమాల చెప్పారు. దాంతో సరేనన్నారు

loader