సీఏఏ వ్యతిరేక ఆందోళనల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన మధ్యవర్తి సంజయ్ హెగ్డే బుధవారం షహీన్‌బాగ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత 67 రోజులుగా షహీన్‌బాగ్ సీఏఏకు వ్యతిరేకంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. 

దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఈ నిరసనలను అక్కడి నుంచి తొలగించాలని, ప్రయాణానికి కలుగుతున్న ఇబ్బందులను తగ్గించాలని సుప్రీమ్ కోర్టులో దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. 

Also Read:ఢిల్లీ షహీన్ బాగ్ ఆందోళనలపై సుప్రీం లో విచారణ : మధ్యవర్తిగా సంజయ్ హెగ్డే నియామకం

గత సోమవారమే ఇందుకు సంబంధించి రెండు పిటిషన్లు సుప్రీమ్ కోర్టులో దాఖలయ్యాయి. నిరసన తెలపడాన్ని తప్పుబట్టట్లేదని చెబుతూనే... ట్రాఫిక్ కి అంతరాయం కలిగించదాన్ని మాత్రం తప్పుబట్టింది. 

నిరసన తెలపడం తప్ప ఒప్పా అనే విషయంపై తాము విచారించబోవడం లేదని, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని తాము దాని జోలికి వెల్లబోవడం లేదని కోర్ట్ తెలిపింది. 

కేవలం ఇలా పబ్లిక్ ప్రాపర్టీ అయినా రోడ్లపైన నిరసన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మాత్రమే తాము తమ పరిగణలోకి తీసుకొని ఈ విచారణ నిర్వహిస్తున్నామని కోర్టు తెలిపింది. 

Also Read:పబ్లిక్ రోడ్డును బ్లాక్ చేస్తారా: షాహీన్‌బాగ్ నిరసనలపై సుప్రీం సీరియస్

నిరసన కారులతో చర్చల కోసం సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డేను కోర్టు మధ్యవర్తిగా నియమించింది. షహీన్ బాగ్ నిరసనకారులతో మాట్లాడి..  వారికీ కోర్టుకు మధ్య మధ్యవర్తిగా సంజయ్ హెగ్డే వ్యవహరించనున్నాడు. 

షహీన్ బాగ్ లో కొనసాగుతున్న నిరసనల్లో ఇప్పటికే అక్కడున్న నిరసనకారుల మధ్య గ్రూపులు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే అమిత్ షా తాను షహీన్ బాగ్ నిరసనకారుల వాయిస్ వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పగానే ఒక వర్గం అమిత్ షా ను కలుస్తామని ర్యాలీగా బయల్దేరడం కొసమెరుపు.