తాను అవినీతికి పాల్పడలేదని, సీబీఐ స్వాధీనం చేసుకున్న ఆస్తులు తాను ఉద్యోగంలో చేరకముందే సంపాదించినవి అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారి సమీర్ వాంఖడే అన్నారు. దేశ భక్తుడిగా ఉన్నందుకు తనకు లభించిన రివార్డు ఇది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ ఆన్ క్రూయిజ్‌ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్ల లంచం కోరిన ఆరోపణలపై మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారి సమీర్ వాంఖడేపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసింది. అయితే దీనిపై వాంఖండే స్పందించారు. తాను దేశభక్తుడిగా ఉన్నందుకు ఇది రివార్డ్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ క్లీన్ స్వీప్.. ఖాతా తెరవలేకపోయిన ప్రతిపక్షాలు..

తన నివాసంపై జరిపిన సెర్చ్ ఆపరేషన్‌పై కూడా ఆయన స్పందిస్తూ.. సీబీఐ రికవరీ చేసిన ఆస్తులను తాను సర్వీస్ లో చేరక ముందే సంపాదించినట్టు తెలిపారు. “నాకు దేశభక్తుడిగా బహుమానం లభిస్తోంది, నిన్న 18 మంది సిబిఐ అధికారులు నా నివాసంపై దాడి చేసి 12 గంటలకు పైగా సోదాలు చేశారు, ఇంట్లో నా భార్య, పిల్లలు ఉన్నారు. నాలుగు ఆస్తి కాగితాలు లభించాయి. ఈ ఆస్తులు అంతకు ముందే సంపాదించనవి. తరువాతే నేను సర్వీస్ లో జాయిన్ అయ్యాను’’ అని ఆయన అన్నారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపింది.

ఘోరం.. పీటీ క్లాస్ మిస్ అయ్యారని 200 సిట్ అప్ ల శిక్ష.. 170 మంది బాలికలకు అస్వస్థత..

కాగా.. ఎన్ సీపీ నుంచి వచ్చిన ఫిర్యాదుపై అవినీతి నిరోధక చట్టం, లంచానికి సంబంధించిన నిబంధనలతో పాటు నేరపూరిత కుట్ర (120-బీ ఐపీసీ), దోపిడీ బెదిరింపు (388 ఐపీసీ) కింద సమీర్ వాంఖడేపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై, ఢిల్లీ, రాంచీ, లక్నో, గౌహతి, చెన్నైలోని 29 ప్రాంతాల్లో వాంఖడేతో పాటు మరో నలుగురిపై (అప్పటి ఎన్‌సీబీ సూపరింటెండెంట్ విశ్వ విజయ్ సింగ్, ఇంటెలిజెన్స్ అధికారి ఆశిష్ రంజన్, మరో ఇద్దరిపై) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత సీబీఐ శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.

24 ఏళ్ల తరువాత కాంగ్రెస్ కంచుకోటను కైవసం చేసుకున్న ఆప్.. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ.. ఎక్కడంటే ?

ఇదిలా ఉండగా.. 2021 అక్టోబర్‌లో వాంఖేడ్ టీమ్ ముంయిలోని ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్‌లో కొర్డెలియా క్రూజ్‌లో రైడ్ చేసింది. అందులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పాటు ఇతరులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ 22 రోజులు జైలులో గడిపాడు. ఆ తర్వాత సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేశారు.