కుళాయి నుంచి ‘సాంబారు’..ఇదేలా సాధ్యం.. ? వీడియో వైరల్..

కుళాయి నుంచి సాంబారును పోలిన నీళ్లు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ ప్రజల నీళ్ల కష్టాలను చూపించే ఈ వీడియోను  ధనుంజయ పద్మనాభచా షేర్ చేశారు.

Sambar from tap. Dirty water in an apartment in Bengaluru. The video has gone viral..ISR

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శోభా ఎరీనా అపార్ట్ మెంట్ లోని ఓ ప్లాట్ కుళాయి నుంచి బురద నీరు వస్తోంది. అది చూడటానికి అచ్చం సాంబార్ లా కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ధనుంజయ పద్మనాభచా దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఈ ప్రాంతానికి కావేరీ నీటి సరఫరాలో తలెత్తున్న సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.

20 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. సన్యాసిగా మారి తల్లినే భిక్ష అడిగాడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

ధనుంజయ పద్మనాభచార్ షేర్ చేసిన ఈ వీడియోలో కుళాయి నుంచి పాన్ లోకి గోధుమ రంగు నీరు ప్రవహిస్తోందని చెబుతూ.. శోభా ఎరీనా అపార్ట్ మెంట్ వాసులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించారు. ఈ వీడియోతో పాటు, కనకపుర మెయిన్ రోడ్ లోని తలగట్టపురలోని జ్యుడీషియల్ లేఅవుట్ వద్ద కావేరీ జలాలు అందుబాటులో ఉంచాలని పద్మనాభచా విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత పద్మనాభచార్ ఇతర అపార్ట్మెంట్ వాసులు అందించిన ఇతర ఫొటోలను కూడా పంచుకున్నారు, బురద గోధుమ రంగు నీటితో నిండిన వివిధ వంటగది పాత్రలను అందులో కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 7 న షేర్ చేసిన ఈ వీడియోకు 200,000 పైగా వ్యూవ్స్ వచ్చాయి. దీంతో నెటిజన్లు తాగునీటి సరఫరా భద్రత, నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు.

కుక్కకు సీమంతం.. చికెన్, మటన్ బిర్యానీ, పాయసం, స్వీట్లతో అతిథులకు విందు.. వీడియో వైరల్..

బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) గతంలో ఇలాంటి సమస్యలను అంగీకరించింది, కొత్త పైప్ లైన్ ల ఏర్పాటు చేయడం, మెయింటెన్స్ దానికి కారణమని తెలిపింది. అయితే దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ప్రజల ఆగ్రహావేశాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని పద్మనాభాచారి కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios