Asianet News TeluguAsianet News Telugu

కుక్కకు సీమంతం.. చికెన్, మటన్ బిర్యానీ, పాయసం, స్వీట్లతో అతిథులకు విందు.. వీడియో వైరల్..

తమిళనాడు (tamilnadu)లోని ఓ రైతు కుటుంబం తమ పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం (dog baby shower) వేడుక నిర్వహించింది. ఆ ఇంటికి ఆడబిడ్డకు చేసిన విధంగానే బంధువులను పిలిచి, పసందైన విందును ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tamil Nadu farmer's family conducts dog baby shower.. The video has gone viral..ISR
Author
First Published Feb 8, 2024, 9:56 AM IST | Last Updated Feb 8, 2024, 9:58 AM IST

అది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు తాలూకా కూరక్కనహళ్లి గ్రామంలో ఓ రైతు ఇళ్లు. ఇంటి నిండి ప్రకాశంవతమైన దీపాలు, బంధువులు, ఇరుగు పొరుగవారితో కలకలలాడిపోంది. చికెన్, మటన్ బిర్యానీలు, పాయసం, స్వీట్లు అన్నీ రెడీ అవుతున్నాయి. ఇంకా అతిథులు వస్తూనే ఉన్నారు. ఇదంతా చదువుతుంటే ఆ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందని అనిపిస్తుంది కదూ.. అవును.. అక్కడ సీమంతం ఫంక్షన్ జరుగుతోంది. కానీ ఆ ఇంటి కోడలిదో లేక ఆడపడుచుదో కాదు.. ఆ ఇంట్లోని పెంపుడు కుక్కది.

యూసీసీకి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం.. ‘జై శ్రీరామ్’ అంటూ.. బిల్లులో కీలకాంశాలు ఇవే..

అవును.. మీరు చదవింది నిజమే.. రైతు పరమేష్ ఇంట్లో కొంత కాలంగా జుమ్మే అనే ఆడ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అది ఇటీవల ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోయారు. దానికి ఘనంగా సీమంతం నిర్వహించాలని భావించారు. అనుకున్నదే తడవుగా బంధువులు, ఇరుగు పొరుగువారిని పిలిచి ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ముందుగా జుమ్మెకు కొత్త బట్టలు వేశారు. నదుటిపై కుంకుమ, మెడలో మల్లెపూల దండ వేశారు. ఆ కుక్క ముందు దానికి ఇష్టమైన బిస్కెట్లు, మటన్ చాప్స్ తో నిండిన గిన్నెను పెట్టారు.

ఆ ఫంక్షన్ కు వచ్చిన మహిళలు ఆ జుమ్మే చుట్టూ చాపలో కూర్చొని తమిళం, తెలుగు భాషల్లో జానపద, భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం మహిళలు దీపాలు, కర్పూరం వెలిగించి ఆ కుక్కకు హారతి ఇచ్చారు. ఇలా ఓ ఇంటి ఆడబిడ్దలా జుమ్మేకు సీమంతం వేడుక నిర్వహించి అందరూ సంతోషంగా గడిపారు. తరువాత ఈ ఫంక్షన్ కు వచ్చిన 50కి పైగా అథిథులకు పాయసం, స్వీట్లు, మటన్, చికెన్ బిర్యానీ, రసం, అప్పడంతో విందు ఇచ్చారు. చివరగా అరటిపండ్లు, స్వీట్ పాన్లు కూడా ఇచ్చి పూర్తి ఆతిథ్యాన్ని ఇచ్చారు.

వామ్మో.. రూ.250 కోట్ల ఆస్తులు కూడబెట్టిన శివ బాలకృష్ణ.. ఇంతకీ ఎవరాయన ?

‘‘దాదాపు మూడేళ్లుగా జుమ్మే మాతోనే ఉంటోంది. ఇటీవల అది తొలిసారిగా ప్రెగ్నెంట్ అయ్యింది. దాని సీమంతం ఏర్పాటు చేయడం మా బాధ్యత. గతంలో మాకు కుక్కలు ఉండేవి, కానీ అవన్నీ మగవి. ఇది మేము పెంచుకున్న మొదటి ఆడ కుక్క. అందుకే దానికి మా ఆచారాలన్నీ పాటిస్తూ సీమంతం చేశాం. దానిని బాగా చూసుకుంటున్నాం’’ అని రమేష్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు. కాగా.. కుక్కకు జరిపిన సీమంతం ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios