Asianet News TeluguAsianet News Telugu

లాలూకు ధైర్యం ఉంటే బీహార్ లో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి - కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

లాలూ ప్రసాద్ యాదవ్ కు ధైర్యం ఉంటే బీహార్ లో ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. తాను ఆర్ఎస్ఎస్ వాలంటీర్ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. 

RSS should be banned in Bihar if Lalu has courage - Union Minister Giriraj Singh
Author
First Published Sep 29, 2022, 11:20 AM IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) తరహాలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై నిషేధం విధించాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేయ‌డం ప‌ట్ల బీజేపీ నేత‌లు స్పందిస్తున్నారు. మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్న‌వీస్ లాలూ వ్యాఖ్య‌లపై తీవ్రంగా మండిప‌డ్డారు. తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా స్పందించారు.

ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆర్నెళ్లకు.. తాను రెండో భార్య అని తెలియడంతో.. నవవధువు ఆత్మహత్య..

తాను ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌ని అయినందుకు గర్విస్తున్నానని అన్నారు. అయితే లాలూ యాదవ్ పీఎఫ్ఐ స‌భ్యుడిని అని ఒప్పుకుంటారా  అని స‌వాల్ విసిరారు. ‘‘ మేము ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. లాలూ యాదవ్ తాను పీఎఫ్‌ఐ సభ్యుడినని చెప్పగలరా?బీహార్‌లో మీ ప్రభుత్వమే ఉంది. మీకు దమ్ము ఉంటే బీహార్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించండి. ’’ అని ఆయ‌న హిందీలో ట్వీట్ చేశారు.

కండోమ్ లు కూడా కావాలా?.. శానిటరీ పాడ్స్ గురించి అడిగిన బాలికలతో మహిళా ఐఏఎస్ దురుసు ప్రవర్తన..

మంగ‌ళ‌వారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఐపై నిషేధం విధించింది. అయితే దీనిపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ స్పందిస్తూ.. పీఎఫ్‌ఐతో పాటు, ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్‌ఐ వంటి అన్ని సంస్థలను నిషేధించాల‌ని అన్నారు. దీంతో పాటు ఆర్ఎస్ఎస్ పైనా విచార‌ణ జ‌ర‌గాల‌ని చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుందని చెప్పారు. హిందూ ముస్లిం మతోన్మాదాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

చోళుల టెక్నాలజీని గ్రహించలేకపోయాం.. బృహ‌దీశ్వ‌రాల‌య గొప్ప‌ధ‌నాన్ని చెప్పే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర

లాలూ ప్రసాద్ యాద‌వ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్, మ‌రి కొంద‌రు నేత‌లు కూడా ఇలాంటి డిమాండే చేశారు. కాంగ్రెస్ సీనియ‌న్ నేత సిద్ద‌రామ‌య్య మాట్లాడుతూ.. శాంతికి భంగం కలిగించే లేదా చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవడానికి తాము అభ్యంతరం చెప్పబోమ‌ని అన్నారు. ఆర్ఎస్ఎస్, ఇతరులు కూడా అదే విధంగా శాంతికి భంగం కలిగిస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, అలాంటి సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. 

భార్యతో అక్రమసంబంధం అనుమానం.. సొంత తమ్ముడిని హతమార్చిన అన్న..

ఇటీవ‌ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), వివిధ రాష్ట్ర పోలీసు బలగాలు ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐకి వ్యతిరేకంగా రెండు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై సెప్టెంబర్ 22వ తేదీన 15 రాష్ట్రాల్లో 106 మంది పీఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. అలాగే సెప్టెంబరు 27వ తేదీన పీఎఫ్ఐతో సంబంధం ఉన్న 170 మందిని ఏడు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆ సంస్థ‌ను నిషేధించారు. అనంత‌రం 17 రాష్ట్రాల్లో ఉన్న ఆ సంస్థకు చెందిన ఆఫీసుల‌ను సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్ ల‌ను ఫ్రీజ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios