Asianet News TeluguAsianet News Telugu

భార్యతో అక్రమసంబంధం అనుమానం.. సొంత తమ్ముడిని హతమార్చిన అన్న..

తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో సోదరుడిని కర్రతో కొట్టి చంపిన వ్యక్తిని కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 10న జరిగింది. 

man kills brother over suspicion of affair with his wife in Kanpur, arrested
Author
First Published Sep 29, 2022, 9:30 AM IST

కాన్పూర్ : కాన్పూర్‌లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అనుమానంతో స్వయంగా సొంత తమ్ముడినే హతమార్చాడు. తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన తమ్ముడినే హత్య చేశాడు. నిందితుడిని ధనంజయ్ అలియాస్ పింటు యాదవ్‌గా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత పరారీలో ఉన్న అతన్ని బుధవారం ఉదయం అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు.. తన సోదరుడు శివ బహదూర్ కు తన భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. 

దీంతో ఎలాగైనా అతడిని అంతమొందించాలని అవకాశం కోసం వెతికాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 10న నిద్రిస్తున్న బాధితుడిపై కర్రతో దాడి చేసి, హత్య చేశాడు. ఆ తరువాత రక్తంతో తడిసిన బట్టలు మార్చుకుని ధనంజయ్ మోటార్ సైకిల్ పై పరారయ్యాడు. కాగా ఇతనికి ఈ ఏడాది ఏప్రిల్ 18న వివాహం జరిగింది. నిందితుడిని బుధవారం ఉదయం రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి, మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టించి.. ఓ భార్య ఘాతుకం..

ఇలాంటి ఘటనే, సెప్టెంబర్ 12న ఏపీలోని తిరుపతిలో వెలుగలోకి వచ్చింది. తిరుపతి చిల్లకూరులో దారుణ ఘటన వెలుగు చూసింది.  వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని నిలువునా ముంచేసింది. ఇలాంటి అక్రమసంబంధాలు... క్షణికావేశంలో చేసే తప్పులతో.. వాటిని సరిదిద్దుకోవడాని దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుపతిలో జరిగింది. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తమ్ముడిని.. అన్న కర్రతో కొట్టి హతమార్చిన సంఘటన చిల్లకూరు మండలం కాకువారిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అద్దేపల్లి బాలాజీ, ప్రతాప్ (25)  అన్నదమ్ములు.  

ఇద్దరికీ వివాహాలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. పది నెలల క్రితం ప్రతాప్ భార్య.. కాన్పు సమయంలో మృతి చెందింది. దీంతో ఒంటరి అయిన తమ్ముడిని.. అలా వదిలేయడం ఎందుకని అన్న బాలాజీ చేరదీసి.. తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు. అయితే తమ్ముడు మాత్రం అన్న మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నాడు. వదినతో చనువుగా ఉంటూ వచ్చాడు. వదినామరుదులు మాట్లాడుకోవడం సహజమే అనుకున్నాడు అన్న. అయితే తమ్ముడు ప్రతాప్ ఆమెతో అక్రమ సంబంధంపెట్టుకున్నాడు. అది అన్న గమనించలేదు.  

ఈ క్రమంలో ఆ రోజు రాత్రి ప్రతాప్, తన వదిన ఒకే దగ్గర ఉండటం చూసిన అన్న బాలాజీ కోపోద్రిక్తుడయ్యాడు. పక్కనే ఉన్న కర్రతో తమ్ముడి మీద దాడి చేశాడు. దీంతో తమ్ముడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు గూడూర్ రూరల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ గోపాల్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios