Asianet News TeluguAsianet News Telugu

కండోమ్ లు కూడా కావాలా?.. శానిటరీ పాడ్స్ గురించి అడిగిన బాలికలతో మహిళా ఐఏఎస్ దురుసు ప్రవర్తన..

పాట్నాలో 'అమ్మాయిల విలువను పెంచడం' అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో, మురికివాడలకు చెందిన బాలికలు అడిగిన ప్రశ్నలకుఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రా ఇచ్చిన సమాధానాలు వివాదాస్పదంగా మారాయి. 
 

Want Condoms Too?.. Bihar Officer's Shocker On Girl's Sanitary Pad Query
Author
First Published Sep 29, 2022, 10:09 AM IST

పాట్నా : బీహార్ లో ఓ మహిళా ఐఏఎస్ అధికారి తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. తక్కువ ధరలకు స్కూలు విద్యార్థినులకు శానిటరీ పాడ్స్ అందించాలి అని అడిగిన బాలికలను.. కండోమ్ లు కూడా ఫ్రీగా కావాలా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. దీంతో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... బీహార్ లోని పాట్నాలో.. ‘అమ్మాయిల గౌరవాన్ని పెంచండి’ అనే కార్యక్రమంలో మురికివాడలకు చెందిన విద్యార్థినులతో ఐఎఎస్ అధికారి హర్జోత్ కౌర్ భమ్రా మాట్లాడారు. దీంట్లో భాగంగా బీహార్‌లోని ఓ పాఠశాల విద్యార్థిని “ప్రభుత్వం రూ. 20-30కి శానిటరీ ప్యాడ్‌లను ఇవ్వగలదా?” అని అడిగింది. దీంతో ఆ అధికారి రెచ్చిపోయింది. 

జ‌మ్మూ కాశ్మీర్ లో మ‌రో బ్లాస్ట్.. 8 గంట‌ల్లో రెండో సారి బ‌స్సులో పేలుడు..

ఇప్పుడు శానిటరీ పాడ్స్ అడుగుతున్నారు.. రేపు ప్రభుత్వం జీన్స్ ఇవ్వాలని అడుగుతారు. ఆ తరువాత అందమైన బూట్లు కావాలంటారు.. అంటూ పరుశంగా సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగకుండా రేపు పెళ్లిళ్లైన తరువాత కుటుంబ నియంత్ర కోసం కండోమ్ లు కూడా ఫ్రీగా ఇవ్వాలని అడుగుతారు.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో షాక్ అయిన చిన్నారులు.. అదేంటి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలి కదా.. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది కదా అని ప్రశ్నిస్తే.. 

ఇది మూర్ఖపు ఆలోచన.. అలాంటప్పుడు ఓట్లు వేయకండి. పాకిస్తాన్ తో కలిసిపోండి. డబ్బులిస్తేనే.. సేవలు చేస్తేనే ఒట్లు వేస్తారా? అంటూ వితండంగా వాదించారు. 'సశక్త్ బేటీ, సమృద్ధ్ బీహార్' పై వర్క్‌షాప్‌లో ఒక మురికివాడకు చెందిన ఒక టీనేజ్ విద్యార్థినితో ఈ సంభాషణ జరిగింది. 'ఆడపిల్లల విలువను పెంచే దిశగా చర్యలు' అనేది ప్రాజెక్ట్ ట్యాగ్‌లైన్. హర్జోత్ కౌర్ భమ్రా రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి కార్పొరేషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం యునిసెఫ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో మంగళవారం జరిగింది.

అంతేకాదు, ప్రభుత్వం నుంచి ఫ్రీగా తీసుకోవాలనే పిల్లల ఆలోచనను తప్పుపట్టిన హర్జోత్ కౌర్ భమ్రా ‘ప్రభుత్వం నుంచి ఫ్రీగా పొందాలనే ఆలోచనే తప్పు. ఆ ఆలోచనా విధానం మార్చుకోండి. మీరే స్వయం సమృద్ది సాధించాలి’అని చెప్పొకొచ్చింది. ఈ కార్యక్రమంలో 9, 10 తరగతులకు చెందిన బాలికలు ఎక్కువగా ఉన్నారు.

మరో విద్యార్తిని స్కూల్లో తమ టాయిలెట్ గోడ విరిగిపోయిందని... దీనివల్ల అబ్బాయిలు అందులోకి వచ్చేస్తున్నారని చెప్పింది. దీనికీ ఆమె వంకరగానే సమాధానం ఇచ్చింది. మీ ఇళ్లలో స్త్రీలకు, పురుషులకు విడివిడిగా బాత్రూంలో ఉన్నాయా? ఇక్కడికి వచ్చేసరికి అన్ని వసతులు కావాలని అడుగుతారు? ప్రతీదీ కావాలని అడిగితే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది.. అంటూ కోపానికి వచ్చింది. పాకిస్తాన్ తో కలవండి.. అన్న మాటకు ఓ విద్యార్థులు కోపానికి వచ్చారు. మేము భారతీయులం.. పాకిస్తాన్ తో ఎందుకు కలుస్తాం అంటూ గట్టిగా అరిచారు. 

ఈ సంభాషణ అంతా చూసిన ప్రేక్షకులు ప్రభుత్వ పథకాల మీద ధ్వజమెత్తుతున్నారు. మహిళా అధికారి అయి ఉండి అమ్మాయిల ఇబ్బందులు గ్రహించకుండా మాట్లాడడం శోఛనీయం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, భామ్రా మాత్రం అదంతా తప్పుగా చూపించారని..చెప్పుకొచ్చారు. 
అంతేకాదు.. మహిళల హక్కులు, సాధికారత కోసం నేను గళమెత్తే విధానం అందరికీ తెలుసు.. ఇది నా ప్రతిష్టను దిగజార్చేలా ఉంది అని దీనిమీద చర్యలు తీసుకుంటానని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios