Asianet News TeluguAsianet News Telugu

అందరి వద్దా సెల్‌ఫోన్లున్నాయ్.. కంటెంట్‌ను నియంత్రించాలి: ఓటీటీలపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ఓటీటీ (ott), మొబైల్ కంటెంట్‌ (mobile content), క్రిప్టో కరెన్సీ (crypto currency), బిట్ కాయిన్ (bitcoin) వంటి అంశాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) (rashtriya swayamsevak sangh) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు

rss chief mohan bhagwat sensational comments on ott
Author
Nagpur, First Published Oct 15, 2021, 2:31 PM IST

ఓటీటీ (ott), మొబైల్ కంటెంట్‌ (mobile content), క్రిప్టో కరెన్సీ (crypto currency), బిట్ కాయిన్ (bitcoin) వంటి అంశాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) (rashtriya swayamsevak sangh) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర (maharashtra) లోని నాగ్‌పూర్‌ (nagpur)లో విజయదశమి (vijayadashami) వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ  సంద‌ర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ... ఓటీటీలో చూపించే కంటెంట్‌పై నియంత్రణ లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందులో దేశానికి హాని క‌లిగించే కంటెంట్ ఉండ‌డం స‌రికాద‌ని హితవు పలికారు.

అలాగే ప్రస్తుతం అంద‌రి వ‌ద్దా మొబైల్ ఫోన్ ఉంటోందని, అందువల్ల ప్ర‌జ‌లు వాటిల్లో చూసే కంటెంట్‌ను కూడా నియంత్రించాలని భగవత్ సూచించారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వంటివి దేశాల ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తాయని ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని ప్రభుత్వం నియంత్రించాలని సూచించారు. దేశ‌ విలువల వ్యవస్థపై పలు రకాలుగా దాడులు జ‌రుగుతున్నాయ‌ని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు నేర్పాలని సూచించారు. మరోవైపు, దాయాది దేశం పాకిస్థాన్‌ (pakistan) పైనా మోహ‌న్ భ‌గ‌వత్ మండిప‌డ్డారు. తుపాకుల వాడ‌కంపై శిక్షణ నిచ్చి, ఉగ్రవాదులను పంపి ఆ దేశం ఉగ్ర‌వాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంద‌ని ఆరోపించారు. అలాగే, మనదేశంలో డ్రగ్స్ వాడకం నానాటికీ పెరుగుతోందని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు.

ALso Read:సీఏఏపై వ్యాఖ్యలు.. మేం చిన్న పిల్లలమా: మోహన్ భగవత్‌కు అసద్ కౌంటర్

కాగా, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ కూడా మోహన్ భగవత్ స్వావలంబన, స్వయం సమృద్ది తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మనమంతా ఇంటర్నెట్ తో పాటు అనేక రూపాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని.. కానీ వాస్తవానికి వాటి వెనకున్న టెక్నాలజీ మనది కాదు అని మోహన్ భగవత్ అన్నారు. మనం బయటి నుంచి దానిని తెచ్చుకుంటున్నామని... టెక్నాలజీ అంటే చైనా (china) గురించి మాట్లాడుకోక తప్పదని గుర్తుచేశారు. ప్రతిసారి చైనా వస్తువులను (china products) బహిష్కరించాలని పిలుపునిస్తుంటామని కానీ.. మీ మొబైల్ ఫోన్లలో వుండే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వస్తోందని మోహన్ భగవత్ ప్రశ్నించారు. ఒకవేళ మనం చైనాపై ఆధారపడడం మరింత పెరిగితే, వాళ్లకు మనం దాసోహం అనకతప్పదని ఆయన  హెచ్చరించారు. 

స్వదేశీ అంటే అన్నింటినీ బహిష్కరించడం అని కాదని.. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలని కానీ అది మనకు అనుగుణంగా జరగాలని మోహన్ భగవత్ చెప్పారు. అందుకోసం మనం స్వావలంబన సాధించాలని.. దానితోనే ఉపాధి కల్పన సాధ్యమవుతుందన్నారు. ఒకవేళ మన ఉద్యోగాలు బయటికి వెళ్లిపోతే హింసకు దారిచ్చినట్టేనని అందుకే స్వదేశీ అంటే స్వావలంబన... హింస కాదు అని మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు
 

Follow Us:
Download App:
  • android
  • ios