ఇండియాకు బదులు భారత్ పేరునే వాడండి: మోహన్ భాగవత్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని ఇండియా అని పిలవడానికి బదులు భారత్ అని పిలవాలని సూచించారు. భారత్ అంటే అర్థంకాని వారు ఉండొచ్చని, వారి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరించారు. వారే అది తెలుసుకుంటారని చెప్పారు.
 

rss chief mohan bhagwat calls for using word bharat instead of india kms

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని ఇండియా అని చెప్పుకోవడానికి బదులు భారత్ అనే పిలుచుకోవాలని సూచించారు. ఆయన అసోంలో గువహతిలో నిర్వహించిన సకల్ జైన్ సమాజ్ కార్యక్రమంలో మాట్లాడారు. 

మన దేశానికి భారత్ అనే పేరు శతాబ్దాల క్రితం నుంచి ఉన్నదని మోహన్ భాగవత్ అన్నారు. కానీ, ఆ తర్వాత ఇండియా అనే పేరును ప్రాచుర్యంలోకి తెచ్చారని వివరించారు. ఇప్పుడు మళ్లీ భారత్ అనే పేరును ప్రాచుర్యంలోకి తేవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఇందుకోసం ఇండియా పేరును వాడటం ఆపేయండని చెప్పారు. అందుకు బదులుగా భారత్ అనే పేరును వాడాలని సూచించారు. 

Also Read: కోపంలో భార్యను షూట్ చేసి చంపాడు.. గుండెపోటుతో తనూ కుప్పకూలిపోయాడు.. క్షణాల్లో ఇద్దరు మృతి

కొందరు ఇంగ్లీష్ మాట్లాడేవారికి సందేహాలు రావొచ్చని మోహన్ భాగవత్ అన్నారు. ఇంగ్లీష్‌లో కూడా ఇండియాకు బదులు భారత్ అనే వాడాలని సూచించారు. భాషలు మారినంత మాత్రానా పేరు మారదు కదా అని వివరించారు. ఏ భాషలోనైనా పేరు మారదని అన్నారు. కాబట్టి, భారత్ అని వాడాలని చెప్పారు. కొంత మందికి భారత్ అంటే అర్థం కాకపోవచ్చు.. కానీ, వారి గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవసరమైతే వాళ్లే తెలుసుకుంటారని, అందరికీ మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios