Asianet News TeluguAsianet News Telugu

రూ. 25 కోట్ల ప్రైజ్ మ‌నీ గెలిచినా.. మ‌న‌శ్శాంతిని కోల్పోయాడు.. కేర‌ళ లాట‌రీ విజేత వింత ప‌రిస్థితి..

అందరికీ డబ్బు కావాలి. కానీ ఎంత ? మన దగ్గర  ఎన్ని డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటాం. ? మన అవసరాలకు సరిపోయేంత డబ్బులు అంటూ ఏ సమస్య ఉండదు. కానీ అవసరానికి మించి డబ్బులు ఉంటేనే కొత్త సమస్యలు చుట్టుముడుతాయి. ఇప్పుడు అలాంటి సమస్యలనే కేరళలో ఓ డ్రైవర్ ఎదుర్కొంటున్నాడు. 

Rs. Even though he won 25 crore prize money, he lost his peace of mind.. Strange situation of Kerala lottery winner..
Author
First Published Sep 24, 2022, 2:03 PM IST

కేరళకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచాడు. అన్ని ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలో అత‌డి పేరు మారుమోగిపోయింది. కేర‌ళ ప్రభుత్వం నిర్వ‌హించిన మెగా ఓనం రాఫిల్‌లో రూ. 25 కోట్ల మొదటి పొందిన అదృష్ట‌శాలి అంటూ మీడియా అత‌డిని పొగిడేసింది. కానీ అత‌డి ఆనందం ఎంతో కాలం నిల‌వ‌లేదు. రెండు రోజుల పాటు మీడియాలో త‌న వార్త‌లు విని ఆనందించిన ఆయ‌న.. ప్ర‌స్తుతం ఎంతో బాధ‌ప‌డుతున్నాడు. దానికి కార‌ణం ఏంటో తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

పరీక్షలో కాపీయింగ్, టీచర్ కొట్టాడని.. ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య..

కేర‌ళ‌లో ఒక సాధార‌ణ ఆటో డ్రైవ‌ర్ అనూప్ రూ.25 కోట్ల విలువైన లాట‌రీ విజేత‌గా నిలిచాడు. అయితే ప‌న్ను, ఇతర బకాయిలు అన్ని మిన‌హాయింపులు పోయిన త‌రువాత ఆయ‌నకు ప్రైజ్ మనీగా రూ. 15 కోట్లు రానున్నాయి. అంత పెద్ద మొత్తంలో డ‌బ్బులు వ‌స్తున్నా.. తాను ఇప్పుడు మ‌న‌శ్శాంతిని కోల్పొయాన‌ని చెపుతున్నాడు. ఈ విషయాన్ని ‘జీ న్యూస్’ తన కథనంలో నివేదించింది. ‘‘ నేను మనశ్శాంతిని కోల్పోయాను. నేను నా సొంత ఇంట్లో కూడా ఉండ‌లేక‌పోతున్నాను. ఎందుకంటే నేను మొదటి బహుమతిని గెలుచుకున్నాను. ఈ విష‌యం తెలిసిన చాలా మంది నా ద‌గ్గ‌రికి వ‌స్తున్నారు. త‌మ అవ‌స‌రాలు తీర్చాల‌ని న‌న్ను కోరుతున్నారు. ఇలా వ‌చ్చే వారితో నేను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నేను బహుమతి గెలుచుకునే ముందు వ‌ర‌కు నాకు చాలా మ‌న‌శ్శాంతిగా ఉన్నాను. కానీ ఇప్పుడు అది లేదు. ’’ అని అన్నారు.

‘‘కానీ నేను దానిని గెలవకుంటే ఉంటే బాగుడేందన‌ని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మందిలాగే నేను కూడా ఒకటి లేదా రెండు రోజులు అన్ని వార్త‌ల్లో నిలిచినందుకు నిజంగా ఆనందించాను. కానీ ఇప్పుడు అదే ఒక ప్రమాదంగా మారింది. నేను ఇప్పుడు ప్ర‌శాంతంగా బయటికి కూడా వెళ్ళలేను. త‌మ అవ‌స‌రాలు తీర్చేందుకు సాయం చేయాల‌ని ప్ర‌జ‌లు నా వెంటే ఉంటున్నారు’’ అని అన్నారు. 

ప్ర‌ధాని మోడీ అన్ని పార్టీల నాయక‌త్వాన్ని క‌లవాలి - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

కాగా.. అనూప్ త‌న సోషల్ మీడియా అకౌంట్ ల‌ను ఉప‌యోగించి ప్రజలకు ఇంకా డబ్బు రాలేదని చెప్పడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.‘‘ ఆ డబ్బును ఏమి చేయాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రస్తుతానికైతే ఆ డ‌బ్బు మొత్తాన‌ని రెండేళ్ల పాటు బ్యాంకులో వేస్తాను. కానీ నిజంగా ఇప్పుడు ఆ డ‌బ్బు నా ద‌గ్గ‌ర ఉండ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాను. అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మ‌నీ ఉండే బదులు కొంత త‌క్కువ‌గానే ఉంటే బాగుండేది అనిపిస్తోంది ’’ అని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు.. గోడకూలి 10మంది దుర్మరణం..

తనకు తెలిసిన చాలా మందే ఇప్పుడు శత్రువులుగా మారే అవ‌కాశం ఉంద‌ని అనూప్ వాపోయాడు. ‘‘ నన్ను వెతుక్కుంటూ చాలా మంది వస్తున్నారు. మా ఇంటి చుట్టుప‌క్క‌లే తిరుగుతున్నారు. దీంతో మా ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది అవుతోంది. దీంతో వారు కూడా ఇప్పుడు నాపై కోపంగా ఉన్నారు. మాస్క్ వేసుకున్నా కూడా నేనే విజేత‌ను అని తెలిసి నా చుట్టూ జనాలు గుమిగూడారు. నా మనశ్శాంతి అంతా పోయింది ’’ అని అనూప్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios