Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌ధాని మోడీ అన్ని పార్టీల నాయక‌త్వాన్ని క‌లవాలి - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నో విజయాలు సాధించారని, అయినా ఆయన విధానాలపై ఇంకా కొందరికి అపోహలు ఉన్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అవి తొలగిపోవాలంటే ప్రధాని అని పార్టీల హైకమాండ్ లను తరచూ కలుస్తూ ఉండాలని తెలిపారు. 

PM Modi should meet leadership of all parties - Former Vice President Venkaiah Naidu
Author
First Published Sep 24, 2022, 1:00 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని పార్టీల రాజకీయ నాయకత్వాన్ని తరచుగా కలవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్ర‌ధాని ఇలా చేయ‌డం వ‌ల్ల ప్రతిపక్ష పార్టీలకు ఆయన విధానాలపై ఉన్న కొన్ని అపార్థాలు తొలిగిపోయే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. 

శుక్ర‌వారం కేర‌ళ‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ‘‘ సబ్కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ - ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం (మే 2019-మే 2020)’’ అనే పుస్తకాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య నాయుడు ఆరోగ్యం, విదేశాంగ విధానం, సాంకేతికత వంటి వివిధ రంగాలలో ప్రధాన మంత్రి సాధించిన విజయాలను కొనియాడారు. భారతదేశం ఎదుగుదలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోందని అన్నారు.

ఐరాస వేదికగా పాక్ పీఎంపై విరుచుకుపడ్డ భారత్.. దావూద్ ఇబ్రహీంను పరోక్షంగా ప్రస్తావిస్తూ అటాక్

“ భారతదేశం ఇప్పుడు ఒక శక్తిగా మారింది, దాని స్వరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇంత తక్కువ సమయంలో ఇలా జ‌ర‌గ‌డం మామూలు విషయం కాదు. ఆయన (ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ) చేసిన పనుల వల్ల, ప్రజలకు ఆయన ఇస్తున్న మార్గనిర్దేశం, భారతదేశం పురోగమిస్తోంది ’’ అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి విజయాలు సాధించినప్పటికీ.. కొన్ని అపార్థాల వల్ల, బహుశా కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆయన పద్ధతులపై కొన్ని వర్గాలు ఇప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయ‌ని అన్నారు. కాలక్రమేణా ఈ అపార్థాలు కూడా తొలగిపోతాయ‌ని ఆయ‌న అన్నారు. దాని కోసం ప్ర‌ధాని ఇటు వైపు, అటు వైపు అన్నిరాజ‌కీయ నాయ‌క‌త్వంలోని విభాగాల‌ను త‌ర‌చూగా క‌లుస్తూ ఉండాల‌ని సూచించారు. 

ఇదే స‌మ‌యంలో రాజకీయ పార్టీలు కూడా ఓపెన్ మైండ్‌తో ఉండాలని, ప్రజల ఆదేశాన్ని గౌరవించాలని చెప్పారు.“ రాజ‌కీయ పార్టీలు కూడా ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. ఆయ‌న మీకు శత్రువు కాదు ప్రత్యర్థుడని మీరందరూ అర్థం చేసుకోవాలి. అన్ని పార్టీలు ఒకరినొకరు గౌరవించుకోవాలి.’’ అని ఆయన అన్నారు. 

అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్చ మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని నిషేధించేలా చట్టం చేసినందుకు ప్రధానిని  ప్రశంసించారు. గతంలో దివంగత ప్రధాని నెహ్రూ కూడా ముస్లిం మహిళల సమస్యల పరిష్కారానికి చట్టం చేయలేకపోయారని, ఇది తనకు బాధను కలిగించిందని అన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు నెహ్రూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేకపోయారని తెలిపారు. కానీ ఈ విష‌యంలో మోదీ ధైర్యం చేశార‌ని, దశాబ్దాల తర్వాత మాత్రమే ఈ నిర్ణయం ప్రాముఖ్యతను మ‌నం అర్థం చేసుకుంటామ‌ని చెప్పారు. ఈ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర కూడా ఉన్నారు.

దేశవ్యాప్తంగా 56 చోట్ల సీబీఐ సోదాలు.. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌‌ కేసులో విచారణ..

కాగా.. ఈ ప్ర‌ధాని ప్ర‌సంగాల పుస్తకం పబ్లికేషన్స్ డిపార్ట్‌మెంట్ ప్రచురించింది.ఇందులో వివిధ విషయాలపై, ప‌లు సంద‌ర్భాల్లో  ప్రధాని చేసిన 86 ప్రసంగాలు ఉన్నాయి. ఈ పుస్త‌కంగా ముఖ్యంగా 10 భాగాలుగా ఉంది. ఇందులో  ఆత్మనిర్భర్ భారత్: ఎకానమీ, పీపుల్-ఫస్ట్ గవర్నెన్స్, కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటం, ఎమర్జింగ్ ఇండియా : విదేశీ వ్యవహారాలు, జై కిసాన్, టెక్ ఇండియా-న్యూ ఇండియా, గ్రీన్ ఇండియా-రెసిలెంట్ ఇండియా-క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా -సమర్థవంతమైన భారతదేశం, ఎటర్నల్ ఇండియా-ఆధునిక భారతదేశం : సాంస్కృతిక వారసత్వం, మన్ కీ బాత్ లు ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios