కర్ణాటక సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ 40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
కర్ణాటక : కర్ణాటక ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ లోకాయుక్త శుక్రవారం ఉదయం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఎమ్మెల్యే నివాసంలో సోదాలు జరిపిన అధికారులు రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
40 లక్షలు లంచం తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో కర్ణాటక ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ ఆయన నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో లోకాయుక్త రూ.6 కోట్లను గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ ఎమ్మెల్యేను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.
ఇది యుద్ధ యుగం కాదని మోడీ చెప్పిప్పుడు ప్రపంచం మొత్తం విన్నది : రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా
కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు 40 లక్షల లంచంతోపాటు ప్రశాంత్ మాదాల్ కార్యాలయంలో 1.7 కోట్ల రూపాయలను లోకాయుక్త గుర్తించింది.
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. మాదాల్ విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్. లోకాయుక్త అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లంచం తీసుకున్నాడంటూ ప్రశాంత్‌పై ఓ వ్యక్తి గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్త అధికారులు వల వేసి ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించగా రూ.1.7 కోట్లు దొరికాయి. ప్రశాంత్ తన తండ్రి తరపున లంచం తీసుకుంటున్నాడని అనుమానిస్తున్నామని.. అతని కార్యాలయంలో దొరికిన డబ్బు ఎక్కడిదనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని లోకాయుక్తకు చెందిన ఓ అధికారి తెలిపారు.
