కారు డ్రైవర్ కి పట్టిన అదృష్టం.. అకౌంట్ లో రూ.9వేల కోట్లు జమా.. కానీ అంతలోనే....
కారు డ్రైవర్ కి అదృష్టం పట్టింది. ఒక్కసారిగా ఆయన అకౌంట్ లో రూ. 9వేల కోట్లు పడ్డాయి. దీంతో నమ్మాలో, వద్దో తెలియని అయోమయంలో పడ్డాడు.

తమిళనాడు : చెన్నైలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. కారు డ్రైవర్ బ్యాంక్ అకౌంట్లో రూ. 9,000 కోట్లు జమయ్యాయి. తమిళనాడులోని వాళ్లని నైకార పట్టికి చెందిన రాజు కుమార్ చెన్నై కొడంబాకంలో ఉంటున్నాడు. అతడు అక్కడ తన తన స్నేహితుడి దగ్గర ఉంటూ అద్దెకు కారు నడుపుతుంటాడు. దాంట్లో వచ్చే ఆదాయంతోనే అతని కుటుంబాన్ని నడుపుకుంటాడు. ఈ క్రమంలో ఈనెల తొమ్మిదవ తేదీ సాయంత్రం.. రాజ్ కుమార్ సెల్ ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది.
ఆ మెసేజ్ ను చూసిన రాజకుమార్ అవాక్కయ్యాడు. ఒక్కసారిగా ఏం జరిగిందో నమ్మలేకపోయాడు. తాను చూస్తుంది కలో, నిజమో అర్థం కాలేదు. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముందంటే అతని బ్యాంక్ అకౌంట్ లోకి తమిళనాడు మర్చంటైల్ బ్యాంకు నుంచి తొమ్మిది వేల కోట్లు జమయ్యాయి. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనుకున్నాడు.
ఘోరం.. కుటుంబ సభ్యులను కట్టేసి, వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..
దీనీకోసం తన స్నేహితుడికి రూ.21వేలు ఫార్వర్డ్ చేశాడు. ఆ తర్వాత చూస్తే ఆ మొత్తంలో నుంచి 21000 ఫార్వర్డ్ అయ్యాయి. దీంతో తాను చూస్తుంది నిజమేనని, తన ఖాతాలో వేల కోట్లు ఉన్నాయని అర్థమైంది. కానీ, అంతలోనే అతని సంతోషం ఆవిరయ్యేలా.. తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ ఖాతాలోని మొత్తం డబ్బును వినతి తీసేసుకుంది.
ఆ తర్వాత రాజకుమార్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమిళనాడులోని తూతుకుడిలోని బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి అధికారులు ఫోన్ చేశారు. ఆ డబ్బు పొరపాటున అతని అకౌంట్లో పడిందని తెలిపారు. ఫార్వర్డ్ చేసిన డబ్బును కూడా తిరిగి చెల్లించాలని ఆదేశించారు. దీంతో షాక్ అయిన రాజ్ కుమార్ లాయర్లను కలిశాడు.
వీరు చెన్నైటీ నగర్ లోని బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి రాజ్ కుమార్ తరఫున మాట్లాడారు. దీంతో రాజ్కుమార్ స్నేహితుడికి పంపిన రూ. 21000 తిరిగి ఇవ్వాల్సిన పనిలేదని, దీంతోపాటు రాజ్ కుమార్ కు వెహికల్ లోన్ ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు తెలుస్తోంది.